టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా ఇమేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులలో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడు ఎవర్ గ్రీన్ స్మైల్ తో హెల్దీగా గడుపుతుంది. ఇక ఈ అమ్మడు హ్యాపీ లైఫ్ కోసం తనదైన స్టైల్ లో వివరించిన కొన్ని చిట్కాలు ఒకసారి చూద్దాం. తనలా ఆనందంగా ఉండాలంటే ఈ పనులు తప్పక చేయండి అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ రష్మిక హ్యాపీ లైఫ్ కోసం ఫాలో అయ్యే సింపుల్ చిట్కాలు ఏంటో ఒకసారి చూద్దాం.
హెల్తి ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటాం.. జీవితం సాఫీగా గడుస్తుంది అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. స్వీట్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని.. అయితే ఎప్పుడో ఒకసారి స్వీట్ తప్పక తినొచ్చు.. అవి రిఫైన్డ్ షుగర్‌తో చేయకపోతే మంచిది అంటూ వివరించింది. ఉదయాన్నే కాఫీ తాగే అలవాటును కొందరు అనారోగ్యం అనుకుంటారు.. కానీ కొంచెం తాగితే రోజంతా ఫ్రెష్ గా ఉండొచ్చు అని రష్మిక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
అయితే మనిషి హ్యాపీగా ఉండడానికి ట్రావెలింగ్ కూడా ఏదో ఒక సమయం కేటాయించాలని.. వారికి ట్రావెలింగ్ కోసం వచ్చిన సమయాన్ని మంచిగా వినియోగించుకుంటే బోలెడంత హ్యాపీనెస్ అంటూ ఫేర్ చేసుకుంది.
పుస్తకాలు చదవడం మంచి అలవాటు. ఒక్క మంచి పుస్తకం చదవడం ప్రారంభిస్తే నాకైతే అది పూర్తయ్యే వరకు టైమే తెలియదు అంటూ వివరించింది. ఇక రోజు ఎంత బిజీగా ఉన్నా.. స్ట్రెస్ తగ్గాలంటే కచ్చితంగా నిద్ర కావాలి. శరీరానికి సరిపడా నిద్ర లేకపోతే ఏ పనైనా ఎలా చేస్తాం.. కనుక డైలీ సరిపడా స్లీప్ అవసరం.. ఏ పనిలో అయినా మనకి ఆసక్తి ఉంటేనే అది సులభంగా అనిపిస్తుంది. ఇష్టం లేని ఫీల్డ్ కు వెళ్లి తర్వాత రోజు బాధపడే కంటే మనకు మనసారా నచ్చిన పని చేద్దాం. బిజీ జీవితాల్లో నవ్వడమే మర్చిపోయాం.. మూతి ముడుచుకుని కూర్చుంటున్నాం.
ప్రతి దాంట్లోనూ ఓ సందర్భాన్ని వెతుకుని అందులోనే హ్యాపీనెస్ చూసుకుంటే లైఫ్ అంతా హ్యాపీనెస్ అంటూ వివరించింది. అంతేకాదు పెంపుడు జంతువుల వల్ల మనలో ఉండే స్ట్రెస్ తగ్గుతుంది. అలసటన మర్చిపోయి మనం హ్యాపీగా ఉండగలుగుతాం. నాకు ఔరాతో ఆడుకోవడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అంటూ రష్మిక వివరించింది. అలా తన రియల్ లైఫ్ లో హ్యాపీనెస్‌కు చిట్కాలను రష్మిక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉంటుంది. మీరు కూడా ఆమెలా ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే తను చెప్పిన సింపుల్ చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది.