సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించాలంటే అందాల ఆరబోత చేస్తూ.. గ్లామర్ షో తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు హీరోయిన్స్. ప్రస్తుతం దాదాపు సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్స్ అంతా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అయితే కేవలం అందం ఉన్నంతకాలం వారికి కెరీర్ ఉంటుంది. ఓ వయసు వచ్చాక వాళ్ళు అవకాశాలు తగ్గిపోవడంతో మెల్లగా ఇండస్ట్రీకి దూరమవుతారు. అయితే కొంతమంది హీరోయిన్ మాత్రం అందాన్ని నమ్ముకోకుండా.. కేవలం టాలెంట్ నమ్ముకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అలా తమ టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్లలో నిత్యమీనన్ కూడా ఒకటి. బాలనటిగా మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అక్కడే హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది.
అక్కడ ఆడియన్స్ కు బాగా దగ్గరైన ఈ అమ్మడు.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. డైరెక్టర్ నందిని రెడ్డి అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అవడంతో నిత్యమీనన్‌కు టాలీవుడ్ లో వరుస అవకాశాలు క్యూకట్టాయి.. అయినా ఏ సినిమా పడితే ఆ సినిమాలో నటించకుండా.. కేవలం నటనకి తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్గా మారింది. ఇదిలా ఉంటే గతంలో ప్రభాస్ కారణంగా నిత్యమీనన్ టార్చర్ అనుభవించిందని.. ప్రతి రోజు వెక్కిళ్లు పెట్టి ఏడ్చేదంటూ తెలుస్తుంది. స్వయంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభంలో టాలీవుడ్ లో అడుగుపెట్టినప్పుడు.. ఇక్కడ స్టార్స్ ఎవరూ నాకు తెలియదని.. ఒకసారి ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ప్రభాస్ గురించి ఒక ప్రశ్న అడగగా అసలు నాకు ప్రభాస్ ఎవరు కూడా తెలియదని వివరించిందట.
ఆమె అలా మాట్లాడడంతో మీడియాలో నిత్యమైన మీద ఇష్టం వచ్చినట్లు వార్తలు ప్రచురితం చేశారని.. అవి చూసి ప్రభాస్ అభిమానులు ఆమెని సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ విపరీతంగా ట్రోల్స్ చేసేవారని చెప్పుకొచ్చింది. ఆ ట్రోల్స్‌కు నిత్యమీనన్ ఏడవని రోజు లేదట. కేరళలో పుట్టి పెరిగిన ఈ అమ్మడికి మన టాలీవుడ్ నుంచి కేవలం చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్ మాత్రమే తెలుసట. నాకు తెలిసిన విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పినందుకు.. ఇంతలా వేధిస్తారా అంటూ అప్పట్లో నిత్యమీనన్ వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. కానీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా.. తన ముక్కుసూటితనాన్ని మాత్రం వదులుకోలేదని.. ఎప్పటికీ వదులుకొను కూడా అంటూ నిత్యమీనన్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి.