మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం కమిటీ కుర్రాళ్ళు మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమె నిర్మాతగా వ్యవహరించిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్‌కి ముందు.. ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీ గురించి చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి. ముఖ్యంగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్, అలాగే తన అన్నయ్య చరణ్ గురించి నిహారిక మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వివరించింది.
మెగా ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలతో పాటు.. తన సినిమాల విషయాలను కూడా షేర్ చేసుకున్న నిహారిక.. సోషల్ మీడియా యాక్టివ్ నెస్ గురించి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న వారిలో టాప్ ప్లేస్ లో ఉపాసన ఉంటుందని.. ఆమె ఏ విషయమైనా వెంటనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటుందని.. ఇక వదిన తర్వాత నేను.. నా తర్వాత సాయి ధరమ్ తేజ్ బావ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటామని వివరించింది.
పెద్దనాన్న ఏదైనా ట్రిప్ కి వెళ్ళినా.. వెంటనే అప్డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారని చెప్పుకొచ్చింది. అందరికన్నా తక్కువ చరణ్ అన్న సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారని.. ఏదైనా ఇంపార్టెంట్ విషయానికి మాత్రమే రియాక్ట్ అవుతారని.. అలాగే పవన్ కళ్యాణ్ బాబాయ్ సోషల్ మీడియా లో చాలా వీక్ అంటూ చెప్పుకొచ్చింది. బాబాయ్ సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటారంటూ నిహారిక చేసిన కామెంట్స్ నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి.