సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల్ గా మారిన వారు ఎంతమంది ఉన్నారు. అలాంటి వారిలోనే నేచురల్ స్టార్ నాని కూడా ఒకరు. మొదటి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించిన నాని.. తర్వాత హీరోగా అవకాశాన్ని దక్కించుకొని తన న్యాచురల్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో.. మరోపక్క ప్రొడ్యూసర్ గా మారి పలు సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే నాని నుంచి సరిపోదా శనివారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా సినిమా ప్రమోషన్స్ కోసం మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో రిపోర్టర్స్ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చాడు నాని. ఓ రిపోర్టర్ ప్రశ్నిస్తూ ఈ సినిమా తర్వాత శనివారం అంటే మీకు ఫేవరెట్ గా మారిపోయిందా అంటూ అడగగా.. దానికి నాని సమాధానం చెబుతూ.. నాకు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా శనివారం అంటే చాలా స్పెషల్. ఎందుకంటే ఆదివారం సెలవు వస్తుంది కాబట్టి శనివారం ఇష్టం అంటూ సరదాగా వివరించాడు. నాకు మొదటి నుంచి చదువు పెద్దగా ఇష్టం ఉండేది కాదని.. అందుకే సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయంటూ ఎదురుచూసేవాడినంటూ ఫన్నీగా వివరించాడు. మీలాగే మీ కొడుకు కూడా శనివారం కోసం ఎదురు చూస్తూ ఉంటారా అని అడగగా.. నాని తన కొడుకు జున్ను గురించి మాట్లాడుతూ వాడు ఎప్పుడెప్పుడు స్కూల్ కి వెళ్దామా అని ఎదురు చూస్తాడని వివరించాడు.
ఒకప్పుడు మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు చదువు మాత్రమే చదవాలి.. అంతకుమించి వేరేది ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు కదా పిల్లలకు ఎన్నో యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు. దానితో స్కూల్ కి వెళ్లడానికి వారు ఇష్టపడుతున్నారు. నా కొడుకు ఇంత చిన్న వయసులోనే పియానో నేర్చుకుంటున్నాడు అంటే వాడికి దాని పట్ల ఉన్న ఇంట్రెస్ట్.. ఎంత ఆసక్తి ఉంటే అంత తొందరగా నేర్చుకుంటాడు. మ్యూజిక్ అంటే వాడికి ప్రాణం. భవిష్యత్తులో నా సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వాడే పని చేస్తాడు అంటూ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం నాని చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.