ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటే హాట్ న్యూస్.. నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల లవ్, ఎంగేజ్మెంట్. త్వరలో వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. సమంత విడాకుల తర్వాత మూడేళ్లు శోభితతో డేటింగ్ చేసిన చైతు.. ఇంతకాలం రహస్య ప్రేమాయణం తర్వాత.. ఇద్దరు కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్ధం వేడుకను ఘనంగా జరుపుకున్నారు. అయితే ఎంత సీక్రెట్గా వారి ఎఫైర్ మైంటైన్ చేయాలని చూసినా.. పలు సందర్భాల్లో మీడియా కంటికి ఈ జంట అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే.
ఇక ప్రస్తుతం శోభిత ధూళిపాళ్ల అక్కినేని కోడలు అవుతుండడంతో.. వీరిద్దరికి సంబంధించిన ఎన్నో విషయాలు నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఇక నాగచైతన్య, సమంత.. ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి అందరికీ తెలుసు. కానీ.. శోభిత ఇంతకుముందు ఎవరితోనో ప్రేమలో పడిందట. ప్రేమలో పడింది.. అతనెవరు.. అతని బ్యాగ్రౌండ్ ఏంటి.. అనే విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి అక్కినేని అభిమానులతో పాటు.. సాధారణ ప్రేక్షకుల్లోనూ ఎంతగానో ఉంది. అయితే శోభిత గతంలో ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
శోభిత పేరుకు తెలుగమ్మాయి అయినా.. మొదట బాలీవుడ్‌లో మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తర్వాత ఈ అమ్మడు తర్వాత హీరోయిన్ గా మారి అక్కడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోడల్గా ఉన్న రోజుల్లో ప్రాణవ్ మిశ్ర అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపిందట. ఇతను మరెవరో కాదు ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్.. లగ్జరీ బ్రాండ్ హ్యూమన్ కో.. ఫౌండర్. ఓ ఫ్యాషన్ షోలో వీళ్ళిద్దరూ కలుసుకున్నారట. తర్వాత వీరిద్దరి స్నేహం కాస్త ప్రేమగా మారిందని టాక్. అయితే తర్వాత కొన్ని మనస్పర్ధలు తలెట్టడంతో ప్రాణవ్‌కు శోభిత బ్రేకప్ చెప్పేసిందని.. బాలీవుడ్ మీడియాలో అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.