టాలీవుడ్ లేడీ పవర్ స్టార్‌గా సాయి పల్లవి క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అతి తక్కువ సినిమాలతోనే భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో అయినా.. కంటెంట్ ఉందనిపిస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇక ఎక్కడ చూసినా స్టార్ హీరోయిన్స్ గ్లామర్ ప్రపంచంలో దూసుకుపోతుంటే.. ఈ జనరేషన్ లో కూడా సావిత్రి, సౌందర్య లాంటి స్టార్ హీరోయిన్లలా.. కేవలం ట్రెడిషనల్ పాత్రలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. సినిమాల్లో నటిస్తుంది.
దీంతో ఈ అమ్మడికి తెలుగు ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. ఇక ఈ అమ్మడు తను నటించిన అతి తక్కువ సినిమాలతో ఎనో అవార్డ్లు కూడా దక్కించుకుని దూసుకుపోతుంది. అలా సాయి పల్లవి కేవలం టాలీవుడ్ లోనే కాకుండా.. పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. అందుకే ప్రస్తుతం కోట్లాదిమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాలీవుడ్ రామాయణ సినిమాలో సీత పాత్రను కొట్టేసింది. ఇక పాన్ ఇండిచా స్టార్ డైరెక్టర్‌గా క్రేజ్ సంపాదించుకున్న సుకుమార్ సైతం ఆమెను లేడీ పవర్ స్టార్ అంటూ పొగడ్తల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అలాంటి ఓ రేర్ కాంప్లిమెంట్లు అందుకోవడం హీరోయిన్స్ కు అంత సులువైన విషయంకాదు.
ఈ రేంజ్ లో పేరు సంపాదించుకున్న సాయి పల్లవి.. ఇప్పటికి టైర్2 హీరోలతో మాత్రమే సినిమాలు నటిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఈ ఆరుగురు హీరోలతో మాత్రం కలిసి నటించడానికి ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా.. ఎలాంటి స్టార్ హీరోల సినిమాలకైనా.. ఆమె వ్యక్తిత్వాన్ని కోల్పోవడానికి ఆమె అసలు ఇష్టపడదు. తన పాత్రకు ఇంపార్టెన్స్, కథలో కంటెంట్ ఉందనిపిస్తే మాత్రం.. చిన్న సినిమాలో అయినా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఈ క్రమంలో ఈమె ఇప్పటివరకు రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలను ఒక్కరితో కూడా సినిమాలో నటించలేదు. కాగా దీనికి కారణం ఈ అమ్మడు ఎలాంటి హీరోనైనా డామినేట్ చేసి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోగలదు.
ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం ఇస్తే ఈమె డామినేషన్ తట్టుకోలేమనే ఉద్దేశ్యంతో ఈమెను హీరోయిన్గా తీసుకోవడానికి ఇష్టపడడం లేదట. పైగా లిప్ లాక్ సీన్స్ లేకుండా స్టార్ హీరోల సినిమాలు ఒకటి కూడా ఉండడం లేదు. ఎంత డిమాండ్ చేసిన సినిమా అయినా.. సాయి పల్లవి ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలకు, ఎక్స్‌పోజింగ్‌కు దూరంగానే ఉంటుంది. ఈ క్రమంలో పలు స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చిన అమ్మడు రిజెక్ట్ చేసిందట. అలాగే సాయి పల్లవి ఎప్పటికప్పుడు చాలా లిమిటెడ్‌గా సినిమాలకు కమిట్ అవుతూ.. తన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలకు 100% ఇస్తూ పనిచేస్తుంది. ఇది కూడా స్టార్ హీరోల సినిమాలు రిజెక్ట్ చేయడానికి ఓ కారణం అట.