అమ్మ పాటకి ప్రాణం పోసిన ఈ జాహ్నవి ఎవరో తెలుసా..? కళ్లు చెదిరే బ్యాక్ గ్రౌండ్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయమైనా సరే ఇట్టే వైరల్ గా మారిపోతూ వస్తుంది. మరీ ముఖ్యంగా సామాన్య జనాలు కూడా బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అంతేకాదు టాలెంట్ ఉన్న బ్యూటీస్ అలాగే స్టార్స్ తమ టాలెంట్ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టి బాగా ట్రెండ్ సృష్టిస్తున్నారు . తాజాగా సోషల్ మీడియాలో అమ్మ పాట ఎంత హైలెట్గా మారిందో మనకు తెలిసిందే. ఈ పాట ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంది .

అమ్మ ప్రేమను ..ఆమె పడే కష్టాన్ని పాటగా మనసుకు హత్తుకునే విధంగా పాటకు ప్రాణం పోసిన జాహ్నవి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ పాటను మిట్టపల్లి సురేందర్ రాశారు. ఈ అమ్మాయిని జూనియర్ శ్రేయ ఘోషాల్ అంటూ తెగ పోగిడేస్తున్నారు నెటిజన్లు. కాగా ఇప్పుడు ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . గూగుల్లో బాగా సెర్చ్ చేస్తున్నారు.

ఆ అమ్మాయి పేరు జాహ్నవి. ఆ అమ్మాయి సొంత ఊరు మహారాష్ట్ర . తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. ” నేను తెలుగు అమ్మాయిని నాకు అస్సలు తెలుగు రాదు అని చెప్తుంది”. మిట్టపల్లి స్టూడియో యూట్యూబ్ ఛానల్లో జాహ్నవి అమ్మ పాటను అద్భుతంగా పాడింది . తెలుగు అర్థం కాకపోయినా సరే అమ్మ పాటను చాలా అందంగా పాడింది అంటూ జాహ్నవిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు . ఆమెకు ఇంస్టాగ్రామ్ లో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉండడం గమనార్హం..!!