మహేష్ బాబు తో రాజమౌళి అలాంటి పని చేయించబోతున్నారా ..? ఫ్యాన్స్ కి బిగ్ షాకింగ్ న్యూస్..!

స్టార్ హీరోస్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . మరీ ముఖ్యంగా బడాబడా హీరోస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . తాజాగా సోషల్ మీడియాలో టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుకి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. వైరల్ గా మారింది . మనకు తెలిసిందే.. గుంటూరు కారం తో హ్యూజ్ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకొని ట్రోలింగ్ కి గురవుతున్న మహేష్ బాబు ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాలని భీష్మించుకొని కూర్చున్నారు .

మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది . కాగా ఈ సినిమా కోసం రాజమౌళి – మహేష్ బాబు చేత చాలా కఠిన డైట్ ను ఫాలో చేయిస్తున్నారట . కఠినమైన వ్యాయామాలు కూడా చేయిస్తున్నారట. అందుకే ఆయన ఓ రేంజ్ లో కష్టపడుతున్నట్లు మనకు తెలుస్తుంది . రాజమౌళి సినిమా అంటేనే రిస్కీ షాట్స్ ఎక్కువగా ఉంటాయి .

ఇక భారీ అడ్వెంచర్స్ మూవీ అంటే మాత్రం అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే రాజమౌళి ఈ సినిమాలో మహేష్ బాబు చేత డూప్ లేకుండా రిస్కీ షాట్స్ లో డైరెక్ట్ గా నటింపజేయాలి అని అనుకుంటున్నారట . ఒరిజినాలిటీ కోసమే ఈ విధంగా చేస్తున్నారట. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మహేష్ బాబుని చిక్కుల్లో ఇరికించేస్తున్నావే జక్కన్న అంటూ బాధపడిపోతున్నారు..!!