అమ్మతో కలిసి నవ్వులు పూయిస్తున్న ఈ చిన్నది ఎవరు గుర్తు.. చాలామందికి ఫేవరెట్ హీరోయిన్..?!

ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించడం అంటే.. అంత సులువైన విషయం కాదు. ఒకసారి హీరోయిన్గా సక్సెస్ వచ్చిన తర్వాత ఆ స్టార్‌డం నిలుపుకోవడం కూడా అంతే కష్టం. కొంతమంది హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి ఎంత శ్రమించినా సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో సెకండ్ హీరోయిన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినిమాల్లో రాణిస్తున్నారు. మరి కొంతమంది సక్సెస్ కోసం ఎదురుచూస్తూ హీరోయిన్ అవకాశాల కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఈ పై ఫోటోలో ఉన్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. అమ్మతోపాటు నవ్వులు పూయిస్తున్న ఈ చిన్నది.. ఓ టాలీవుడ్ హీరోయిన్.

చాలా ఫేమస్ బ్యూటీ. అడపాద‌డ‌పా సినిమాల్లో నటిస్తున్న సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను ఆకట్టుకుంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకుంటుంది. ఇంతకీ ఈ చిన్నది ఎవరో కాదు తెలుగమ్మాయి ఈషా రెబ్బ. మొదట కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించిన ఈషా రెబ్బ.. తర్వాత హీరోయిన్గా అవకాశాలను దక్కించుకొని నటిస్తుంది. అంతకుముందు.. ఆ తర్వాత.. సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తర్వాత అమీతుమీ, బందిపోటు, బ్రాండ్ బాబు ఇలా ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన‌ అరవింద సమేత లో హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించి మెప్పించింది. అలాగే త్రీ రోజెస్, పిట్ట కథలు లాంటి వెబ్ సిరీస్ లలోను ఈమె ఆకట్టుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఘాటు అందాలు ఆరబోస్తూ అభిమానులకు హాట్ ట్రీట్‌ ఇస్తుంది ఈ అమ్మడు. అప్పుడప్పుడు పద్ధతిగా మెరుస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో సినిమా అవకాశాలు రాకపోవడంతో ఒక్క మంచి ఆఫర్ వస్తే తన సత్తా చాటుకోవడానికి ఎదురుచూస్తుంది ఈ అమ్మడు.