జాక్ పాట్ ఆఫర్ కొట్టిన యానిమల్ బ్యూటీ.. తారక్ జోడిగా ఛాన్స్.. ఏ మూవీలో అంటే..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానున్నట్టు కొరటాల శివ గతంలో వివరించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ మూవీ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవరతో పాటు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలోను ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఎన్టీఆర్,హృతిక్‌ కాంబోలో వస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్‌గా రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. ఇక ఈ సినిమా కోసం దేవర షూటింగ్ పోస్ట్ పోన్‌చేసి మరీ తారక్ ముంబై వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమారు పది రోజులపాటు ఎన్టీఆర్ వార్‌2 షూటింగ్లో పాల్గొననున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా వార్ 2కు సంబంధించిన ఇంట్రెస్ట్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో యానిమల్ బ్యూటీ త్రిప్తి హీరోయిన్గా నటిస్తోందట.

గతంలో యానిమల్ మూవీ తో కుర్రకారును వేరే లెవెల్ లో ఆకట్టుకున్న‌ ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో యువతకు నేషనల్ క్రష్ గా మారింది. ఇక ప్ర‌స్తుతం ఈ అమ్మడు వార్ 2 సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వీరిద్దరిలో ఎవరికి జోడిగా నటిస్తుందని దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఎన్టీఆర్ వార్ 2 లో రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. అయితే తాజాగా అందుతున్న వార్తలు ప్రకారం ఎన్టీఆర్‌కు జోడీగా ఈ అమ్మడును సెలెక్ట్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.