న‌టి వ‌ర‌ల‌క్ష్మి ఎంగేజ్‌మెంట్‌పై మాజీ ప్రియుడు విశాల్ షాకింగ్ కామెంట్స్.. ఏమ‌న్నాడంటే..!

స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తన నటన‌తో లక్షలాదిమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల రిలీజైన హనుమాన్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న ఈ అమ్మడు.. ఇటీవల తన ప్రియుడుతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ స్పందించారు. తమిళ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం రత్నం మూవీ తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో ప్రియా భవాని హీరోయిన్గా నటిస్తుంది.

Varalaxmi Sarathkumar gets engaged to Mumbai gallerist Nicholai Sachdev -  Hindustan Times

సింగం సిరీస్ ఫేమ్ డైరెక్టర్ హరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ ఏప్రిల్ 26న ప్రేక్షకులు ముందుకు రానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్‌. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విశాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. వరలక్ష్మి గురించి తలుచుకుంటే చాలా ఆనందంగా ఉందని.. అతి తక్కువ టైంలోనే భారీ క్రేజ్ సంపాదించుకోవ‌డం.. ఉన్నత స్థాయికి చేరుకోవడం నాకు సంతోషంగా అనిపిస్తుంది అంటూ చెప్పుకోచాడు విశాల్‌.

తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఆమె భారీ క్రేజ్ తో రాణిస్తుంది.. హనుమాన్ లో ఆమె పాత్ర మెస్మరైజింగ్ గా ఉందంటూ వివరించాడు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో కూడా మంచి మార్కులు కొట్టేసిందని.. ఇక ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ లో అడుగుపెడుతున్నందుకు ఆమెకు నా బెస్ట్ విషెస్ అంటూ తెలియజేశాడు విశాల్. కాగా వరలక్ష్మి శరత్ కుమార్ విశాల్ లవ్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో విశాల్‌ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.