“అస్సలు ప్రభాస్ తో శ్యామల దేవికి సంబంధమే లేదు”.. కాంట్రవర్షియల్ విషయాని పెంట పెంట చేసేస్తున్న వేణుస్వామీ..!

వేణు స్వామి ..కావాలని గెలుకుతున్నాడా..? లేక తెలియక గెలుకుతున్నాడా ఏమో తెలియదు కానీ ప్రభాస్ అభిమానులును మాత్రం పదే పదే గెలుకుతున్నాడు . అసలే ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామి అంటే ఎలా ఫైర్ అయిపోతున్నారో మనం చూస్తున్నాం . ఇలాంటి క్రమంలోనే వేణు స్వామి తాజాగా ఉగాది సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి ప్రభాస్ ఫ్యామిలీపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాని సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్నాయి .

అసలు ప్రభాస్ అంటే ఎందుకు వేణు స్వామికి ఇంత కోపం అనే రేంజ్ లో మాటలు మాట్లాడేలా చేసుకున్నారు వేణు స్వామి. వేణు స్వామి గతంలో ప్రభాస్ జాతకం పై ఎన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడో తెలిసిందే. అయితే వాళ్ల పెద్దమ్మ కూడా దానికి రీకౌంటర్ వేసింది. అసలు ప్రభాస్ జాతకం వాళ్ళ అమ్మ గారి దగ్గర తప్పిస్తే మిగతా వాళ్ళ దగ్గర లేదు అని మరి ఆయన ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అని ఓ రేంజ్ లో ఫైర్ అయింది .

దానికి ఇన్నాళ్లకు కౌంటర్ ఇచ్చాడు వేణు స్వామి . ప్రభాస్కు ఆయన పెద్దమ్మ శ్యామలాదేవికి సంబంధం లేదు ఇది చాలామందికి తెలియకపోవచ్చు చాలామంది అనుకుంటూ ఉంటారు బంధువులే కదా అని కానీ అసలు విషయం ఏంటో నాకు మాత్రమే తెలుసు ..చాలామంది ఆయన పెద్దమ్మ బంధువులా..? కాదా..? అని తెలియకుండా ఉంటుంది . నా వరకు శ్యామల దేవి కంటే ప్రభాస్ తల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అయినప్పటికీ వాళ్ళ వ్యక్తిగతల విషయాల గురించి నాకు అనవసరం.

ప్రభాస్ జాతకం వేరే వాళ్ళ దగ్గర ఉందా ..? లేదా..? అన్నది కూడా నాకు తెలియదు . నేను మాత్రం ప్రభాస్ జాతకం చూశాను. ప్రభాస్ ఫ్యూచర్లో జరగబోయేది ఇదే ప్రభాస్ జాతకం నా చేతికి ఎవరి ద్వారా వచ్చిందో నేను చెప్పను.. ఒకసారి శ్యామలాదేవి కూడా నా దగ్గరికి వచ్చారు. కానీ ప్రభాస్ జాతకం కోసం కాదు కృష్ణంరాజు గురించి కనుక్కోవడానికి ఆయన బ్రతికున్నప్పుడు గవర్నర్ అవుతారా..? లేదా..? అని తెలుసుకోవడానికి వచ్చారు . అయితే అప్పుడు నేను ఆమెకు తెలియదు అన్నట్లుగానే మాట్లాడింది అంటూ సంచలన కామెంట్స్ చేశాడు వేణు స్వామి. ప్రజెంట్ ఆయన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.