ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ ..మృణాల్ ఠాకూర్ సంచలన నిర్ణయం.. ఇక మేకర్స్ చచ్చారు పో..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా హిట్ అవుతుంది .. ఏ సినిమా ఫట్ అవుతుంది అని చెప్పడం పెద్ద గగనంగా మారిపోయింది. చిన్న చిన్న హీరోలు నటిస్తున్న సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతూ పెట్టిన దానికి నాలుగు రెట్లు లాభాలు తీసుకొస్తున్నాయి . బడాబడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల సినిమాలు సోషల్ మీడియాలో నెగటివ్ టాక్ సంపాదించుకుంటున్నాయి.

డిజాస్టర్ మూవీస్ గా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి . రీసెంట్ గా విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఎంత డిజాస్టర్ టాక్ అందుకుందో మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ సినిమాను ఏకిపారేసారు జనాలు . కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్త వైరల్ గా మారింది . ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన మృణాల్ ఠాకూర్ ఇకపై ఫ్యామిలీ ఓరియెంటెడ్ రోల్స్ చేయకూడదు అంటూ డిసైడ్ అయిందట .

మొదటి నుంచి మృణాల్ ఠాకూర్ చాలా కూల్ గా ఉండే లుక్స్ లోనే కనిపిస్తూ వస్తుంది . బహుశా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం మృణాల్ ఠాకూర్ రోల్ కూడా కారణమై ఉండొచ్చు అంటున్నారు జనాలు . ఈ విషయం తెలుసుకున్న మృణాల్ ఠాకూర్ తన క్యారెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండే విధంగా చూస్ చేసుకుంటుందట . ఆ కారణంగానే ఆల్రెడీ తెలుగులో కమిట్ అయిన ఒక సినిమాను క్యాన్సిల్ కూడా చేసేసుకుందట . రెమ్యునరేషన్ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేసిందట . ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు..!!