ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండి ఉంటే ..పుష్ప 2 టీజర్ ఇంకా మంచి టాక్ దక్కించుకొని ఉండేదా..?

సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రిలో ఐకాన్ స్టార్ పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2 . పుష్ప గాడి రూలింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా..? అంటూ కోట్లాదిమంది జనాలు వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు . కేవలం కొద్ది రోజులే కొద్దిరోజులు అంటే కొద్ది రోజుల్లోనే పుష్ప గాడి రూలింగ్ స్టార్ట్ కాబోతుంది .

రీసెంట్గా ఆయన పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ బాక్స్ ఆఫీస్ లో దుమ్ము దులిపేస్తుంది . సోషల్ మీడియాను షేక్ చేసి మడత పెట్టేసింది . బన్నీ నటన అంటే ఏంటో చిన్న టీజర్ తోనే చూపించేశాడు సుకుమార్. అయితే ఈ టీజర్ మొత్తం బాగున్నప్పటికీ ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా బన్నీ నోట చెప్పించలేదు సుకుమార్ .

దానికి రీజన్ ఏంటా అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంత పెద్ద స్టార్ పుట్టిన రోజుకి టీజర్ రిలీజ్ చేస్తూ ఒక్క డైలాగ్ కూడా చెప్పలేదు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . బన్నీ ఫాన్స్ కూడా డీప్ గా హర్ట్ అయ్యారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సుకుమార్ కావాలని పుష్ప2 టీజర్ లో బన్నీ చేత డైలాగ్స్ చేపించలేదట . బన్నీ పర్ఫామెన్స్ ఈ సినిమాల్లో వేరే లెవెల్ లో ఉంటుందని.. ఒక్కొక్క డైలాగ్స్ ఆటో బాంబుల్లా పేలుతాయని అన్ని ఒకేసారి రివిల్ చేస్తే సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోతాయి అన్న కారణంతో సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారట .ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!