ప్రభాస్ ‘ రాజా సాబ్ ‘ మూవీలో అసలు ట్విస్ట్ లీక్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..?!

ప్రస్తుతం పాన్ ఇండియ‌న్ స్టార్ హీరోగా ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా సలార్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ప్రభాస్.. త్వరలో కల్కి 2898 ఏడి, రాజా సాబ్‌ సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలతో పాటు మరోపక్క సలార్‌2, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఎవరికీ సాధ్యం కానీ రేంజ్ లో రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు వెళుతున్న ప్రభాస్.. మారుతి డైరెక్షన్‌లో రాజా సాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ పోస్టర్‌ను చూసిన ప్రతి ఒక్కరిలో ఇది ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అనే భావన కలిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే.. ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్ ఒకటి లీక్ అయిపోయిందంటూ వార్తలు వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏదో కాదు.. ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తున్న నిధి అగర్వాల్, ప్రభాస్ తోనే ఉంటూ ప్రభాస్‌ని మోసం చేసి తన దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నీ తీసుకెళ్ళి పోతుందట. అయితే సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రభాస్‌తో ట్రావెల్ చేసిన ఆమె ఎక్కడా కూడా చిన్న డౌట్ రానీయకుండా కంటిన్యూ అవుతూనే చివర్లో ప్రభాస్ కి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుందని ఇదే ఈ సినిమాలో మెయిన్ ట్విస్ట్ అని తెలుస్తుంది.

కాగా ప్రస్తుతం ఈ ట్విస్ట్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ క్రమంలో అందరూ ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు. మరి ఇప్పుడు ట్విస్ట్ తెలిసిపోయింది కాబట్టి.. సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి తగ్గిపోతుంది.. ఈ క్రమంలో మారుతి మూవీ ట్విస్ట్ మార్చే అవకాశం ఏదైనా ఉంటే బాగుంటుంది అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్ర‌భాస్ అభిమానులు. సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎంతో గోప్యంగా ఉంచుతూ తెరకెక్కించే ప్రయత్నం చేస్తుంటే.. ఇలా ట్విస్ట్ రివీల్‌ చేయడం ఏంటి.. అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే ఇదే మెయిన్ ట్విస్టా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక మారుతి మాత్రం ఈ కామెంట్లు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ప్రశాంతంగా సినిమా తీస్తున్నాడు.