నేను హీరో అవ్వడానికి కారణం ప్రభాస్.. నవీన్ చంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..?!

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లో హీరోగా మంచి పాపులారిటి దక్కించుకున్నాడు నవీన్ చంద్ర. తర్వాత హీరోగానే కాకుండా.. విల‌న్ పాత్ర‌లోను నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న ఈ యంగ్ హీరో.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీగా ఎదిగాడు. ఇటీవల కాలంలో న‌వీన్ ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. ఇందులో భాగంగా తన సినిమాలోకి రావడానికి గల కారణాలను తెలియజేస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. హీరో ప్రభాస్ గురించి ఆయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే రాజమౌళి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులారిటీ ద‌క్కించుకున్నాడు ప్రభాస్.

కాగా ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఈయనకు తెలుగులో ఎంతోమంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్.. వర్షం సినిమాతో స్టార్ హీరోగా మారాడు. గతంలో చిరంజీవి అంజి, బాలకృష్ణ లక్ష్మీనరసింహ సినిమాలతో పోటీగా రిలీజైన ఈ వర్షం మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య సినిమాలను ఓడించి విన్నార్ గా నిలిచింది. ఇక అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ విజయం సాధించడమే కాదు.. ప్రభాస్ కి మాస్ హీరో ఇమేజ్‌ని తెచ్చి పెట్టింది. ఇక అప్పట్లో ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్‌లో నవీన్ చంద్ర డ్యాన్సర్‌గా స్టేజిపై డ్యాన్స్ వేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడట.

ఈ విషయాన్ని నవీన్ చంద్ర స్వయంగా వివరించాడు. ఆ ఫంక్షన్ కి ప్రభాస్ కోసం వచ్చిన జనాన్ని చూసి నేను ఆశ్చర్యపోయానని.. దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రభాస్ ని చూసేందుకు వర్షం 50 డేస్ ఫంక్షన్ కి ఆడియన్స్ వచ్చారని.. వర్షం ప్రభాస్‌కు కేవలం మూడో సినిమా. ఆ టైంలోనే ఆరెంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి నేను ఆశ్చర్యపోయాను అంటూ వివరించాడు. హీరో అవ్వాలని కోరిక నాకు అప్పటి నుంచే మొదలైందని.. హీరో అయితే అంతటి ఫాలోయింగ్ వస్తుందా అని నేను షాక్ అయ్యానని.. అయితే నేను హీరోని అవాల‌ని ప్రభాస్ వల్లే ఫిక్స్ అయ్యా అంటూ వివరించాడు నవీన్ చంద్ర. ఇక ప్రస్తుతం నవీన్ చంద్ర.. ప్రభాస్ గురించి చేసిన ఈ కామెంట్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది