బన్నీకి నేషనల్ అవార్డ్ రావడానికి కారణం అదే.. ఫహద్ ఫాసిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా లెవెల్ లో భారీ పాపులాంటి దక్కించుకున్నాడు. ఇక ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ రోల్ లో మలయాళం నటుడు ఫహద్ ఫాసిల్ నటించి మెప్పించాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో ఈయన పాత్ర మరింత హైలెట్‌గా మారింది. ఇక సీక్వెల్ సినిమాలో ఈయన రోల్ ఎంతో కీలకంగా నిలవనుంది. ఇలా పలు సినిమాల్లో విలన్ పాత్రలో నటిస్తూ.. మరోవైపు హీరోగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ఫ‌హ‌ద్‌. ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించిన ఫ‌హద్‌ ప్రస్తుతం ఆవేశం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

ఈ క్రమంలో వ‌రుస ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నాడు. ప‌లు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా పుష్ప సినిమా గురించి కూడా కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. పుష్ప 2లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది.. అనే ప్రశ్న ఎదురుకాగా.. దీనికి ఆయన స్పందిస్తూ ఈ సీక్వెల్ సినిమాల్లో నా పాత్ర చాలా క్రూరంగా ఉంటుంది. భయంకరంగా ఉంటుందని నేను చెప్పను. కానీ చాలా డిఫరెంట్ రోల్ నేను ప్లే చేస్తున్నా అంటూ వివరించాడు. ఈ నేపద్యంలోనే ఈయనకు మరో ప్రశ్న ఎదురయింది.

ఇటీవ‌ల కాలంలో విలన్ పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. పుష్ప సినిమాలో మీరు చేసిన విలన్ రోల్ హీరో పాత్ర కంటే ఎక్కువగా ఆడియన్స్ కు కనెక్ట్ అయింది. ఇది మీరు ఎలా తీసుకుంటున్నారు.. అనే ప్రశ్న ఎదురు కాగా ఆయన స్పందిస్తూ ఈ సినిమాలో నాకంటే అల్లు అర్జున్ నటన మరింత అద్భుతంగా ఉంది. అతని మేనరిజం.. ఆయనకు మరింత పాపులారిటీని తెచ్చి పెట్టింది. ఈ సినిమా కోసం నా కష్టం కంటే అల్లు అర్జున్ ఇంకా ఎక్కువగా కష్టపడ్డారు.. అందుకే ఆయనకు ఏకంగా నేషనల్ అవార్డ్ వ‌రించింది అంటూ ఫహద్ వివరించాడు. ప్రస్తుతం ఫ‌హ‌ద్‌ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.