పోతే పోయింది ఫ్యామిలీ స్టార్.. బంగారం లాంటి ఛాన్స్ కొట్టేసిన రౌడీ హీరో..!

పాపం ..విజయ్ దేవరకొండ తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది . ఈ సినిమా కలెక్షన్స్ చూసి చాలా చాలా డీల పడిపోయారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. పరమ చెత్త టాక్ అందుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ కి కూడా గురయ్యారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ విజయ్ దేవరకొండ ను ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారో ఆకతాయిలు మనకు తెలిసిందే.

 

అయితే ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ అయినా పర్లేదు అద్దిరిపోయే ఆఫర్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ అంటూ సోషల్ మీడియాలో సరికొత్త న్యూస్ ట్రెండ్ అవుతుంది. విజయ్ దేవరకొండ ప్రజెంట్ విజయ్ తిన్నూరి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్లుగా మలయాళీ లేటెస్ట్ సెన్సేషన్ మమిత బైజు అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది .

ఈ సినిమా కాకుండా మరో పాన్ ఇండియా సినిమాకి కమిట్ అయ్యాడట విజయ్ దేవరకొండ. ఫుల్ టు ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ గా తెరకెక్కబోతుందట. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లక్కీ హీరోయిన్ రష్మిక మందన్నా నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆయనకు ఫుల్ జోష్ క్రియేట్ చేస్తున్నారు . పోతే పోయింది ఫ్యామిలీ స్టార్ జాక్పాట్ ఆఫర్ పట్టావుగా సక్సెస్ కొడతావు అంటూ సపోర్ట్ చేస్తున్నారు..!