ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడురోయ్.. కటౌట్ తోనే కేక పెట్టిస్తున్నాడుగా..!

సినిమా ఇండస్ట్రీలో వారసత్వం పేరుతో ఒకరి తరువాత ఒకరు ఇండస్ట్రీ లోకి రావడం పెద్ద కొత్త విషయం కాదు. అయితే ఇప్పటికే చాలామంది స్టార్స్ అలా నాన్న పేర్లు తాతల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో రెబెల్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. రెబెల్ ఫ్యామిలీ అనగానే అందరికీ గుర్తొచ్చేది కృష్ణంరాజు ఇప్పుడు ప్రభాస్ .

పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ తన సినిమాలతో ఎలా ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఉంటాడో మనకు తెలిసిందే. అయితే ప్రభాస్ తర్వాత రెబెల్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వస్తున్నాడు మరో హీరో. ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ హీరోగా తెలుగు ఆడియన్స్ కు పరిచయం కాబోతున్నాడు . ఈ మూవీ నేడు గ్రాండ్ గా లాంచ్ అయింది .

టాలీవుడ్ స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు డాన్స్ మాస్టర్ గా వర్క్ చేసిన గణేష్ మాస్టర్ పవన్ కళ్యాణ్ సినిమాలతో బాగా ఫేమస్ అయ్యాడు . ఇప్పుడు ఆయన డైరెక్టర్ గా మారబోతున్నాడు ఈ పూజా కార్యక్రమాలకు సుకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఈ సినిమాకి గౌడ్ సాబ్ అనే టైటిల్ను ఖరారు చేశారు . త్వరలోనే ఈ సినిమా షూట్ ప్రారంభం కాబోతుంది అంటూ చెప్పుకొచ్చారు. విరాట్ కట్ అవుట్ చూస్తుంటే మరో పాన్ ఇండియా హీరో ఇండస్ట్రీకి దొరికేశాడు అంటున్నారు అభిమానులు..!!