టిల్లు గాడి చేతిలో ఓటమి చూసిన మహేష్.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

ఇటీవల కాలంలో యంగ్ హీరోలు మంచి కాన్సెప్ట్లతో సినిమాలు తెర‌కెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే దానిని కచ్చితంగా ఆదరిస్తూ ఉంటారు. కనుక మంచి సినిమా ఎవరు తీసిన సక్సెస్ కామన్ గానే ఉంటాయి అనేది వాస్తవం. ఇక ఇప్పటికే ఈ సంవత్సరం తెలుగు సినిమాల్లో హవా కొనసాగుతుంది. తాజాగా ఈ మూడు నెలల కాలంలో వచ్చిన సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్‌లో తెర‌కెక్కిన సినిమాగా మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా మొదటి షో నుంచే డివైడ్ టాక్ రావడంతో ప్రేక్షకులు కొంతవరకు సినిమాను చూడడానికి ఆసక్తి చూపలేదు.

ఇక దీనికి తోడు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హనుమాన్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులంతా ఈ సినిమా వైపే మగు చూపారు. దీంతో సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించడమే కాదు.. చిన్న సినిమాగా వచ్చి రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి ప్రభంజనం సృష్టించింది. ఇదిలా ఉంటే తాజాగా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా కూడా ఇదే విధంగా అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ కలెక్షన్లను కొల్లగొట్టి ఏడాదిలో ఇప్పటివరకు రిలీజ్ అయ్యే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సినిమాల్లో టాప్ 2 గా నిలిచింది. ఇక అమెరికాలోను భారీ వాసులను రాబడుతున్న టిల్లు స్క్వేర్ ఇప్పటికే మహేష్ హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమా రికార్డును బ్రేక్ చేసి అద్భుతమైన వసూళ్లను సాధించి సినిమా టీం లో మరింత జోష్ణ పెంచేసింది.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో అమెరికాలో ఎక్కువ వసూలు రాబట్టిన సినిమాల్లో హనుమాన్ మొదటి స్థానంలో లాంగ్ రన్ లో రూ.5.26 మిలియన్ డాలర్లు వాసులను కొల్లగొట్టగా. గుంటూరు కారం సినిమా రూ.2.63 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇక ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమా మూవీ రూ.2.68 మిలియన్ డాలర్లను వసూళ్ళు చేసి హనుమాన్ తర్వాత సెకండ్ పొజిషన్ దక్కించుకుంది. దీంతో టిల్లు గాడు మహేష్ లాంటి స్టార్ హీరో రికార్డును బ్రేక్ చేసి సక్సెస్ అందుకున్నాడంటూ న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా లాంగ్ రాన్‌లో మూడు మిలియన్ డాలర్ల వరకు వసూళ్ళు రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.