అమ్మతో కలిసి అమాయకంగా ఫోటోకు స్టిల్ ఇచ్చిన ఈ చిన్నోడు టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?!

ఈ పై ఫోటోలో తల్లితో కలిసి అమాయకంగా ఫోటోకు స్టిల్ ఇచ్చిన కుర్రాడు.. ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరో. అయితే కొంతమంది హీరోలు కేవలం కథానాయకుడిగా మాత్రమే నటించాలని రూల్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న యంగ్ హీరో మాత్రం ఎలాంటి రోల్ అయినా సరే ఎంత ఛాలెంజింగ్ పాత్రలో అయినా సరే కథలు కంటెంట్ ఉందనిపిస్తే నటించేందుకు ముందు ఉంటాడు. ఇదంత తేలికైన వ్యవహారం కానప్పటికీ.. కథ నచ్చితే తన పాత్ర నడివి ఎంతుంది, ఫైట్స్ ఉన్నాయా.. సాంగ్స్ ఉన్నాయా.. ఇలాంటివి ఏమీ చూడకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచేస్తాడు. అలాంటి హీరోలు మన ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉన్నారు. ఇంత‌కీ ఈ యంగ్ హీరో ఎవరో గుర్తుపట్టారా..

ఆయ‌న‌ ఎవరో కాదు ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకు తానుగా కష్టంతో ఎదిగి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర. ఓవైపు హీరోగా పలు సినిమాల‌లో నటిస్తూనే.. మరోవైపు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ లో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అప్పుడప్పుడు విలన్ పాత్రలోనూ మెరుస్తున్న ఈ హీరో.. మన తెలుగు కుర్రాడే కావడం విశేషం. కాకపోతే బళ్లారిలోని దేవి నగర్ లో ఈయన జన్మించాడు. అతని తండ్రి కర్ణాటక రోడ్డు రవాణా సంస్థలో హెడ్ మెకానిక్ గా వర్క్ చేశారు. ఈ క్రమంలో నవీన్ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లమా పూర్తి చేశాడు. ఇండస్ట్రీకి రాకముందు మల్టీమీడియా యానిమేటర్ గా కొన్నేళ్లు పనిచేసిన నవీన్.. 2006లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 2012లో తెరకెక్కిన అందాల రాక్షసి సినిమా ద్వారా క్రేజ్‌ సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత హీరోగా పలు సినిమాల్లో నటించిన పెద్దగా సక్సెస్ రాలేదు. ఇక నేచురల్ స్టార్ నాని హీరోగా వ‌చ్చిన నేను లోకల్ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. అప్పటినుంచి నవీన్ చంద్రకు భారీ క్రేజ్ ఏర్పడింది. అరవింద సమేత వీర రాఘవ మూవీలో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఓ పాత్రలో చేసాడు. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన భానుమతి అండ్ రామకృష్ణ మూవీ తో హీరోగా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇటీవల మంత్ ఆఫ్ మధు సినిమాతో హీరోగా మరోసారి తన లక్ చెక్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా కూడా వర్కౌట్ కాలేదు. మొత్తానికి హీరోగా మంచి సక్సెస్ అందుకోకపోయినా అన్ని క్యారెక్టర్స్ లో నటిస్తూ తన నటనను ప్రూవ్ చేసుకుంటున్నాడు. వచ్చిన ప్రతి ఛాన్స్ ను ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతున్నాడు.