వార్నీ..మా పాన్ ఇండియా హీరోని ముసలోడు చేసేశావు కదరా డైరెక్టర్.. వైరల్ అవుతున్న లుక్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్స్ ఎక్కువగా తమ ఫ్యాన్స్ కి సంబంధించిన విషయాలపై ఫోకస్ చేయడం ప్రారంభించారు. మరి ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న స్టార్స్ గురించి ఎక్కువగా థింక్ చేయడం మనం చూస్తున్నాం . రీసెంట్గా సోషల్ మీడియాలో ప్రభాస్ లక్ వైరల్ గా మారింది. జనరల్ గా ప్రభాస్ అంటే చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు .

ఆరడుగుల కటౌట్ మనందరికీ తెలిసిందే . అయితే తాజా లుక్ చూస్తే ఒక్కసారిగా ఆయనను గుర్తుపట్టడం కష్టంగా మారిపోతుంది . ఏంటి ఈ హీరో నేనా మా ప్రభాస్ అని.. షాక్ అయిపోయే రేంజ్ లో ఉన్నాడు . వైట్ షర్ట్ లో జుట్టు పెంచేసి గడ్డంతో కళ్ళకు క్లాసెస్ తో అస్సలు ప్రభాస్ నేనా..? అనిపించే రేంజ్ లో ఉన్నాడు . దీంతో కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన లుక్స్ ను ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటే మరి కొంతమంది ఏంట్రా బాబు ఇది..? ఇలా తయారు చేశాడు నాగ్ అశ్వీన్ అంటూ మండిపడుతున్నారు.

లాంగ్ హెయిర్ తో బరువు బాగా తగ్గిపోయి హ్యాండ్సమ్ గా ఉన్నప్పటికీ ..ఆ లుక్కు మాత్రం చూడలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు . యానిమల్ సినిమాలో రణబీర్లా ఉన్నాడు అంటూ మరికొందరు కౌంటర్స్ వేస్తున్నారు . ఇది కల్కి సినిమాకి సంబంధించిన లుక్కా..? లేకపోతే వేరే ఏదైనా సినిమాకి సంబంధించిన లుక్ నా..?అంటూ కామెంట్స్ చేస్తున్నారు . కొందరు డైరెక్టుగా నాగ్ అశ్వీన్ కు మా హీరో ని ఇలా తయారు చేసేసావ్ ఏంట్రా బాబు..? అంటూ కౌంటర్స్ వేస్తున్నారు . మొత్తానికి ప్రభాస్ తన లుక్స్ తో ఇండస్ట్రీని సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్నాడు..!!