మీరు సీఎం అయితే ఏం చేస్తారు?.. ఆలీ ప్రశ్నకు దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిన ఆర్జీవి ‌..!

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. తల్లి, భార్య కూతుర్లు కన్నా తనను తాను ఎక్కువగా ప్రేమించుకునే ఆయన..ఎవరి కోసము నేనెందుకు త్యాగం చేయాలి అనే ఫిలాసఫితో బతికిస్తాడు. తన సంతోషమే తనకు ముఖ్యం అంటూ యంగ్ బ్యూటీతో టైం స్పెండ్ చేస్తాడు.

నటించినట్లుగా మందేసి చిందేస్తాడు. ఎవరేమనుకున్నా పర్లేదు అని తన లైఫ్ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ ఇంటర్వ్యూలో నైనా తన స్టైల్ లో ఆన్సర్ ఇంజన్ ఇచ్చే వర్మ..ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న వీడియోలోనూ అలాంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హోస్ట్ అలి ‘ సపోజే ఏపీ ప్రజలంతా కలిసి నిన్ను సీఎం చేస్తే నీ ఫీలింగ్ ఏంటి? అని ప్రశ్నించాడు.’ నాకు అలాంటి పదవులు, బాధ్యతలు అంటే అస్సలు నచ్చదు. ఒకరి కోసం నా టైమ్ నేనెందుకు వేస్ట్ చేయాలి. ఎవరి గురించో నేనెందుకు ఆలోచించాలి. నిజంగా సీఎం ఎలా పని చేస్తాడో నాకు తెలియదు కానీ ఒకవేళ ఆ ఛాన్స్ వస్తే మాత్రం ప్రజల డబ్బు లాక్కుని, ఖజానా ఖాళీ చేసి విదేశాలకు చెక్కేస్తాను అని నిర్యాహమాటం గాగ చెప్పాడు ఆర్జీవి.