నా రాజకీయ ఎంట్రీ వెనుక ఉన్న కారణం ఇదే.. విశాల్ కామెంట్స్ వైరల్..!

సార్వత్రిక ఎన్నికలవేళ పలువురు సినీ సెలబ్రిటీలు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. కొందరు ఎన్నికలలో పోటీ చేస్తుండగా..మరి కొందరు సొంతంగా పార్టీలను స్థాపిస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో విజయ్ సైతం ఇటీవల తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సొంత పార్టీ పెట్టి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తునని దళపతి స్పష్టం చేశాడు.

విజయ్ బాటలోనే మరో తమిళ్ స్టార్ హీరో విశాల్ సైతం పొలిటికల్ ఎంట్రీ పై కీలక ప్రకటన చేశారు. ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్ తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించాడు. కొత్త పార్టీ స్థాపించి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నానని తెలిపాడు. విశాల్ సైతం విజయ్ మాదిరిగానే ఈ పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉండి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతానని చెప్పాడు.

ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీపై విశాల్ తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ పార్టీస్ ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తే.. తన లాంటి వారు రాజకీయాల్లో రావాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలు ప్రజలకు మంచి చేస్తే తాను రాజకీయాల్లోకి రాబోనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గ్రామీణ్ ప్రజలకు ముఖ్యమైన వసతులను పూర్తి స్థాయిలో ఇప్పటికీ రాజకీయ పార్టీలు కల్పించలేదని, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్న వాటిని అందించాల్సి అవశ్యకత ఉందన్నాడు. ప్రెజెంట్ పొలిటికల్ పార్టీస్ విధానాలు నచ్చకే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేశాడు. 2026 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఈ సందర్భంగా విశాల్ మరొక్కసారి క్లారిటి ఇచ్చాడు. తమిళనాడులోని అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడిఎంకే పార్టీలను తాను విమర్శించడం లేదన్నారు.