ఎట్టి పరిస్థితుల్లోనూ చికెన్ వండేటప్పుడు ఈ పదార్థం వేయకూడదు.. ఎందుకంటే..?

ఈ మధ్యకాలంలో నాన్ వెజ్ లవర్స్ ఎక్కువగా పెరిగిపోయారు . ఒకప్పుడు మీద జనాభా ఇప్పుడు మాంసాహారాన్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారు . మరీ ముఖ్యంగా ఒకప్పుడు కేవలం ఆదివారం .. లేకపోతే ఏదైనా అకేషన్.. ఏదైనా సందర్భం ఉంటేనే ఇంట్లో మాంసాహారం కనిపించేటివి .. ఇప్పుడు వారానికి నాలుగు సార్లు అయినా సరే వంటింట్లో మాంసాహారం వండేస్తున్నారు. అలా మారిపోయింది పరిస్థితి .

ఇలాంటి క్రమంలోనే నాన్ వెజ్ లవర్స్ తెలుసుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ గా మారింది. సాధారణంగా ఈ మధ్యకాలంలో చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ కాంబోస్ ని లైక్ చేస్తున్నారు . అయితే కొన్ని కొన్ని పదార్థాలతో కొన్ని కొన్ని ఐటమ్స్ తినకూడదు అన్న విషయం మర్చిపోతున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో అలాంటి వార్త బాగా వైరల్ గా మారింది . ఆదివారం నాన్ వెజ్ తినే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది .

అయితే మనం చికెన్ వండుకునేటప్పుడు అన్ని స్పైసెస్ గరంమసాలాలు వేసి ఘాటుగా వండుకుంటాం.. కానీ కొందరు డిఫరెంట్ టేస్ట్ కోసం కొన్నిసార్లు అందులో తీపి పదార్థాలను వేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . అయితే ఎలాంటి పదార్ధాలు వేసిన పర్లేదు ..కానీ చక్కెర – బెల్లం లాంటి పదార్థాలను ఎప్పుడు కూడా చికెన్ లో వేసి వండకూడదు అంటూ సూచిస్తున్నారు నిపుణులు . అలా వండితే అది విషయంగా మారిపోతుందట. అది ఆరోగ్యానికి మరింత హానికరంగా మారిపోతుందట. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ చికెన్ లో బెల్లం చక్కెర వేసి వండకండి అంటూ సూచిస్తున్నారు..!!