పిఠాపురంలో హౌస్ రెంట్ కి తీసుకున్న పవన్ కళ్యాణ్.. రెంట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్కన సినిమాలతో, మరొక రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న పవన్ ప్రస్తుతం జనసేన పార్టీ అధినేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం ఏపీ పాలిటిక్స్ లో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పిఠాపురం ఆంజనేయ స్వస్థలంగా మార్చుకుంటాను అంటూ.. పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించాడు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు లో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆయన ఎంపిక చేసుకున్న ఈ బిల్డింగ్ ప‌నులు చివ‌రి ద‌శ‌కు చేరాయి.

చేబ్రోలుకు చెందిన అభ్యుదయ రైతు ఓదూరి నాగేశ్వరరావు ఈ భావనాన్ని వ‌ట్టుకున్నారు. పార్టీ కార్యకర్తల నిర్వహణ వసతికి అనువుగా ఈ బిల్డింగ్ ఉండడంతో దీనినే పవన్ కళ్యాణ్ తన నివాసంగా ఎంపిక చేసుకున్నాడు. ఇక ఈ కొత్త ఏడాది ఉగాది వేడుకలను చేబ్రోలులోని ఈ నివాసంలోనే పవన్ కళ్యాణ్ చేసుకోబోతున్నారట. గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ రోడ్డు పక్కన తన పంట పొలాల్లో రైతు ఓదురి నాగేశ్వరరావు మూడు అంతస్తుల భవనాన్ని కట్టుకున్నాడు. ఆ భవనాన్ని పవన్ నివాసం ఉండ‌నున్నాడు. జనసేనాని తన సొంత ఇంటిని నిర్మించుకునే వరకు ఇక్కడే ఉండనున్నాడు. ఈ ఇంటికి శుక్రవారం గృహప్రవేశ వేడుకలు జరిగాయి.

ఇప్పుడు తుదిమెరుగులు దిద్దుతున్న ఈ బిల్డింగ్.. గ్రౌండ్ ఫ్లోర్లో పూర్తిగా వాహనాలు పార్కింగ్‌కు స్థలాని కేటాయించారు. మొదటి ఫ్లోర్లో ఆఫీస్ నిర్వహణకు రెండు మూడు అంతస్తులు కలిపి డూప్లెక్స్ తరహాలో స్థాపించారు. పవన్ కు అణువుగా ఉంటుందని భావించిన పార్టీ నేతలు ఈ భవనాన్ని ఆయన కోసం ఎంపిక చేశారు. ఓదూరి నాగేశ్వరరావు పవన్ అభిమాని కావడంతో భవనాన్ని ఇచ్చేందుకు అంగీకరించార‌ట‌. అయితే తనకు అద్దె వద్దని.. కేవలం ఒక రూపాయి ఇస్తే చాలని ఆయన వివరించినట్లు సమాచారం. ఉగాది వేడుకల్లో పాల్గొన్నందుకు ప‌వ‌న్ పిఠాపురం రానున్న క్రమంలో.. ఉగాది కల్లా పనులన్నీ పూర్తి చేసి ఇక్కడే పార్టీ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాలని జనసేన నేతలు నిర్ణయించుకున్నారట. ఇంటికి సమీపంలో పంట పొలాల్లో హెలీప్యాడ్ ఏర్పాటు పనులు కూడా ప్రారంభించారు.