ఇన్నాళ్లకు జాక్ పాట్ కొట్టిన ఇస్మార్ట్ బ్యూటీ.. మొత్తం ఎన్ని సినిమాల్లో నటిస్తుందంటే..

టాలీవుడ్ లో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకోవడం చాలా కష్టం. అలా దొరికిన అవకాశాన్ని నిలుపుకోవాలన్న అంతే శ్రమించాల్సి వస్తుంది. అయితే గతంలో న‌టా న‌భాష ఇస్మార్ట్ శంకర్ తో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. స్లిమ్ బ్యూటీగా మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో భారీ సక్సస్‌ను అందుకుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో స్టార్ హీరోయిన్ బ్రాండ్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా సక్సెస్ సాధించినా ఏవో కారణాలతో సినిమాలకు దూరమైంది న‌భా. అయితే ఆరు నెలల క్రితం మళ్లీ యాక్టివైన ఈ ఇస్మార్ట్ బ్యూటీ మరోసారి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఎట్టకేలకు ఇప్పుడు వరుస సినిమా అవకాశాలను అందుకుంటుంది. ఇక ఇటీవల ఆమె పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. ఈ క్రమంలో పుట్టినరోజు సందర్భంగా వచ్చిన సమాచారం ప్రకారం.. మూడు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న విశ్వంభ‌ర. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కీలకపాత్రలో నభా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న‌ మరో పాన్ ఇండియా మూవీ స్వయంభులోను నటిస్తోంది.

మరో రెండు సినిమాల్లో ఈమె నటిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాస్త పేరు ఉన్న ప్రొడక్షన్ హౌస్, హీరోల సినిమాల‌లోనే నటిస్తుంద‌ట‌. వాటిలో ఫిమేల్ లీడ్ మూవీ ఒకటి. ఇందులో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. అలాగే మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ఓ సినిమాలోని నాభా నటాషా హీరోయిన్గా అవకాశం అందుకుందని టాక్. ఇప్పటికే వీరిద్దరూ సోలో బతికే సో బెటర్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో మంచి ఫలితాన్ని అందుకుంది. ఇక తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నభా నటాషా ఎలాంటి సక్సెస్‌లు అందుకుంటుందో వేచి చూడాలి.