జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో శ్రీదేవి రోల్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరంటే..?!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెర‌కెక్కిన సోషియ ఫాంటసీ డ్రామా జగదేకవీరుడు అతిలోకసుందరి. 1990లో రిలీజైన ఈ మూవీ అప్పట్లో ఎలాంటి రికార్డ్‌ సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ మూవీలో స్వర్గం నుంచి భూమి మీదకి వచ్చిన దేవకన్య పాత్రలో దివంగత నటి శ్రీదేవి నటించి ఆకట్టుకుంది. అప్పటి నుంచి శ్రీదేవిని అతిలోకసుందరి అని టాలీవుడ్ ప్రేక్షకులు పిలుస్తూ ఉంటారు. అంతలా ఈ పాత్ర శ్రీదేవి కెరీర్‌ను ప్ర‌భావితం చేసింది. అయితే ఈ పాత్ర మొదట మరో హీరోయిన్ చేయాల్సి ఉందట. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ అవకాశం చివరకు శ్రీదేవికి వచ్చింది. ఇంతకీ ఆ అన్ ల‌క్కి హీరోయిన్ ఎవరు..? ఆమె సినిమాకు నో చెప్పడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం.

ఆమె ఎవరో కాదు కన్నడ బ్యూటీ ప్రేమ. తెలుగులో ధర్మచక్రం, దేవి సినిమాల‌తో స‌క్స‌స్ అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ 1995లో కన్నడ సినిమాతో తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. అయితే కెరీర్ 1995లో స్టార్ట్ చేస్తే.. 1990లో రిలీజ్ అయిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను ఈమె ఎలా మిస్‌ చేస్తుంది అనుకుంటున్నారా.. మొదట ప్రేమ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు ఓకే చెప్పి ఉంటే అదే ఆమె డబ్యు మూవీ అయ్యేది. కానీ అప్పుడు ఆమెకు నటనపై ఆసక్తి లేకపోవడంతో.. ఏయిర్‌హోస్టస్‌ అవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. అయితే ప్రేమ తల్లి మాత్రం ఆమెను నటిగా చూడాలని భావించారు. ఈ కారణంగా వారిద్ద‌రి మధ్య చిన్న గొడవ కూడా జ‌రిగింద‌ట‌.

చివరకు ప్రేమ తల్లి భావించినట్లుగానే సినీ రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది. అయితే ముందే ప్రేమ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఉంటే జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి బ్లాక్ బస్టర్ ఆమె ఖాతాలో పడేది. అయితే ఈ సినిమాతో పాటు ప్రేమకు ఆ తర్వాత 1991లో వ‌చ్చిన‌.. క్షణం క్షణం సినిమాలో కూడా ఆఫర్ వచ్చిందట. ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేయడంతో ఈ అవకాశాన్ని కూడా శ్రీదేవి అందుకుంది. అయితే ఆ రెండు సినిమాలను అప్పట్లో వదులుకున్నందుకు ప్రేమ ఇప్పటికి కూడా బాధపడుతూనే ఉందట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో ఏదేమైనా అతిలోకసుందరి పాత్రలో మాత్రం శ్రీదేవి సెట్ అయినట్లు మరే హీరోయిన్ సెట్ అవ్వదు అంటూ ఆమె అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.