ఈ ఫోటోలో కనిపిస్తున్న బూరి బుగ్గల బుజ్జాయి.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?!

ఈ పై ఫోటోలో బోరి బుగ్గలతో.. క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న చిన్నది.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనే స్పెషల్ బ్యూటీ. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ సంపాదించుకుంది. వరుసగా హిట్ సినిమాలను అందుకుంటూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పాటు చేసుకున్న ఈ ముద్దుగుమ్మ డాక్టర్ పట్టాను అందుకున్న తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్గా మారింది. అనుకోకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ నటన‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. ఈ ముద్దుగుమ్మ 1991 జనవరి 6న కేరళ త్రివేండ్రంలో జన్మించిన్న ఈ బ్యూటీ.. 2017లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మలయాళ, తమిళ, తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలను అందుకుంటు విజయాలను సొంతం చేసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ అయిన తరువాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం విశేషం. 2014లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. 2017 లో నిజందుకలడి నాటి ఒరిదేవుల మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. అదే ఏడాది మాయానది సినిమాలో అపర్ణ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకుంది.

ఈ సినిమాలో ఐశ్వర్య నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఐశ్వర్య ఈ సినిమాతో ఫిలింఫేర్, సైమా,క్రిటిక్స్ అవార్డులతో సహా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. గాడ్సే మూవీతో తెలుగు తెరకు పరిచయమై మంచి సక్సెస్ అందుకుంది. డైరెక్టర్ మణిశర్మ రూపొందించిన పొన్నియ‌న్ సెల్వ‌న్‌ సినిమాలోను కీలక పాత్రలు నటించింది. తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన అమ్ము సినిమాతో మరోసారి సక్సెస్ అందుకుంది. అయితే ఒకప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ బ్లాక్‌బ‌స్టర్ సక్సెస్‌లను అందుకున్న ఐశ్వర్య.. ప్రస్తుతం అవకాశాలు రాకపోవడంతో సైలెంట్ గా ఉంది. చివరిసారిగా మట్టికొస్తి, పొన్నియ‌న్ సెల్వ‌న్‌ సినిమాలో నటించింది.