టీజర్ రిలీజ్ కి ఒక్కరోజు ముందే పుష్పాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసిన అల్లు అర్జున్.. పోస్ట్ వైరల్..

సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలను పరిష్కరించుకుంటూ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, గ్లింప్స్ వీడియో ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో సినిమా టీజర్.. అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్గా రేపు రిలీజ్ చేస్తున్నామంటూ యూనిట్ ప్రకటించారు. ఇక ఈ టీజర్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో కరెక్ట్‌గా ఒక్కరోజు ముందే అంటే ఈరోజు బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్ లో పుష్ప పోస్టర్‌తోపాటు.. అంతా సిద్ధమైంది అంటూ క్యాప్షన్ పెట్టి పెద్ద స్క్రీన్ పై టైటిల్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెంచాడు.

ఇక ఈ ఫోటో ద్వారా పుష్పా 2 ట్రైత‌ర్ రెడీ అయిపోయిందని.. రేపు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాం అంటూ క్లారిటీ ఇచ్చాడు బన్నీ. ఈ పోస్టుతో అల్లు అర్జున్ అభిమానులు ఇంట్రెస్ట్ మరింతగా పెరిగింది. అయితే పుష్ప పార్‌ట్‌ వన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తో పార్ట్ 2 పై బీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా పుష్పరాజ్ పార్ట్ 2 రెడీ అయిందా.. లేదా.. ఈ సినిమాతో సుకుమార్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో తెలియాలంటే వేచి చూడాలి. అయితే బన్నీ అభిమానులు మాత్రం పుష్పాను మించి ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంటుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.