ప్రాణంగా ప్రేమించి ఇప్పుడు ఛీ కొడుతుంది.. భార్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన కమెడియన్ పంచ్ ప్రసాద్..

బుల్లితెర బిగ్గెస్ట్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో పంచ్ ప్రసాద్ ఒకడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రసాద్.. శాస్త్ర చికిత్స అనంతరం కోలుకొని ఇప్పుడిప్పుడే షోలలో పాల్గొంటున్నాడు. ఇలాంటి క్రమంలో తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రసాద్ మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ కమెడియన్గా క్రేజ్‌ సంపాదించుకున్న ఆయ‌న‌.. శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ కంటెస్టెంట్ గా వ్యవహరిస్తున్నాడు. పంచ్ ప్రసాద్ కిడ్నీ సమస్యతో బాధపడుతూ కొన్నేళ్లగా చికిత్స తీసుకుంటున్నాడు.

అయితే వ్యాధి తీవ్రత పెర‌గ‌డంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడింది. ఏపీ ప్రభుత్వం చొర‌వ‌తో ఆ కిడ్నీ ట్రాన్స్ప్లంటేష‌న్‌ సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ నేపథ్యంలో పంచ్ ప్రసాద్ కొంతకాలం ఎటువంటి టీవీ షోలను కనిపించలేదు. ఇక తాజాగా జబర్దస్త్, శ్రీదేవి కంపెనీ షోలకు హాజరవుతున్నాడు. అయితే పంచ్ ప్రసాద్ ఇంత త్వరగా కోలుకోవడానికి అతడి భార్య పాత్ర ఎంతగానో ఉంది. ఆమె పంచ్ ప్రసాద్ ను ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. ఒకానొక సమయంలో ప్రసాద్ నడవలేకపోవడంతో ఎంతో శ్రద్ధ వహించిన ఆమె.. కిడ్నీ అవసరమైతే తన కిడ్నీ ఇవ్వడానికి కూడా సిద్ధమైంది.

అయితే సరైన సమయానికి కిడ్నీ దొరకడంతో ఆమె కిడ్నీ అవసరం ప‌డ‌లేద‌ట‌. ఇలాంటి క్రమంలో పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ భార్య గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. త‌న‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సునీత.. ఇప్పుడు ఛీ కొడుతుందని వివరించాడు. నా కామెడీ, పంచ్‌లు నచ్చే అభిమాని అని నన్ను వివాహం చేస్తుందని.. కానీ ఇప్పుడు నా పంచ్‌లు అసలు నచ్చడం లేదంటూ మొఖం మీద ఛీ కొడుతుందని.. ట్రీట్మెంట్ తర్వాత నేను కోలుకున్నా.. కానీ నా భార్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుందంటూ వివరించాడు. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.