మామిడి పండు తిన్న వెంటనే అసలు తీసుకోకూడని ఆహారాలు ఇవే.. తింటే డేంజర్ లో పడినట్టే..?!

సమ్మర్ సీజన్ అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది మ్యాంగో సీజన్. కేవలం సమ్మర్ సీజన్‌లో మాత్రమే దొరికే ఈ పండ్లను తినడానికి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు వేసవి వస్తుందా.. ఎప్పుడెప్పుడు మామిడి పండ్లను ఆస్వాదిద్దామా.. అంటూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వేసవిలో రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ చూసినా మామిడి పండ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే అలా అని ఎక్కువగా మామిడిపండు తినడం అసలు మంచిది కాదు. ముఖ్యంగా వేసవిలో మామిడి పండ్లు మితిమీరి తిన‌టం వల్ల ఎన్నో సమస్యలు చెవి చూడాల్సి వస్తుంది.

Curd Side Effects:दही के फायदे तो सुने होंगे साइड इफेक्ट जानकर डेली दही खाना छोड़ देंगे

మామిడి పండ్లు తిన్న వెంటనే కొన్ని రకాల పదార్థాలను అస్సలు తినకూడదని నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ ఆ పదార్థాలు ఏంటో.. తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి చూద్దాం. సాధారణంగా మామిడి జీర్ణ క్రియ మెరుగు పరుస్తుంది. రోకనిరోధక శక్తిని బలపరిచి బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, ఫైబర్ లాంటివి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరిచేందుకు.. విటమిన్ ఏ కళ్ళను ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తాయి. ఇక చాలామందికి మామిడి పండును పెరుగుతో కలుపుకొని తినే అలవాటు ఉంటుంది. అలా తినడం వల్ల అనారోగ్యానికి దారితీస్తాయని నిపుణులు చెప్తున్నారు.

Don't Like Spicy Food but Feel Left Out? Train Your Taste Buds - The New York Times

మామిడిపండు, పెరుగు వెంట వెంటనే తినడం వల్ల కడుపులో కార్బన్డయాక్సైడ్ శాతం పెరిగి కడుపునొప్పి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మామిడిపండు తినేముందు.. తిన్న తర్వాత.. నారింజ, కమలా లాంటి సిట్రస్ యాసిడ్ లో ఉండే పండ్లను తీసుకోకూడదు. ఇది శరీరంలోని పీహెచ్ లెవ‌ల్‌ను దెబ్బతీసి.. ప‌లు అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మామిడి పండ్లు తిన్న వెంటనే.. తిన్న తర్వాత.. స్పైసి ఫుడ్ తింటే ఎసిడిటీ, గుండెల్లో మంట, మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే కాకరకాయ తిన్న తర్వాత.. తినే ముందు మామిడి పండును అసలు తినకూడదట. ఇవి మాత్రమే కాకుండా కూల్ డ్రింక్స్, మంచినీళ్లు లాంటివి కూడా మామిడి పండుతో కలిపి తీసుకోకూడదని.. ఇలా చేస్తే ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు.