ప్రియదర్శి, నభా నటాష్ మధ్య ‘ డార్లింగ్ ‘ లొల్లికి వెనుక అసలు కథ ఇదే.. ఏం జరిగిందంటే..(వీడియో)?!

టాలీవుడ్ స్టార్ కమెడియన్ ప్రియదర్శి.. హీరోయిన్ న‌భా నటేష్‌లు గొడవపడినట్లుగా రీసెంట్గా వార్తలు వైర‌ల్ అయినా సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా వీరిద్దరి మధ్యన మాటలవార్‌ కొనసాగింది. ప్రభాస్ వాయిస్ తో మాషప్‌ వీడియోను నభా నటేష్‌ రిలీజ్ చేయగా.. దీనిపై ప్రియదర్శి స్పందిస్తూ వావ్.. సూపర్ డార్లింగ్ కిరాక్ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో నభా నటేష్‌ కోపం గా డార్లింగ్ ఎవరు.. ఐసిసి సెక్షన్ 354 ప్రకారం పరిచయం లేని స్త్రీని డార్లింగ్ అంటే లైంగిక వేధింపులతో సమానం.. మిస్టర్ అంటూ కామెంట్ చేసింది.

అలాంటి ఫోటో షేర్ చేసిన నభా నటేష్.. అవాక్కైన ఫ్యాన్స్.. - Actress Nabha Natesh Instagram Photo Goes Viral In Social Media

ముందు మాటలు జాగ్రత్త అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. అయితే వీరిద్దరి మధ్యన జరిగిన ఈ మాటల సంభాషణ అంతా నెట్టింట‌ తెగ వైరల్ గా మారింది. దీంతో వీరు ఏదో సినిమా ప్రమోషన్స్ కోసం ఇదంతా చేస్తున్నారంటూ పలు కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే అందరూ అనుకున్నట్లుగానే ప్రమోషన్స్ భాగంగానే వీరు ఇలా సోషల్ మీడియా వేదికగా పంచాయతీ పెట్టారు. తాజాగా ప్రియదర్శి, నభా నటేష్ ప్రధాన పాత్రలో డార్లింగ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆశ్వినీ రామ్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతుంది.

Priyadarshi and Nabha Natesh pair up for 'Darling' | Telugu Cinema

హనుమాన్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కే.నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా అనౌన్స్మెంట్ గ్లింప్స్‌ను యూనిట్ ప్రకటించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య చేతిలో కీలుబొమ్మల భర్త పరిస్థితి మారిపోతుందంటూ.. ఈ సినిమాలో ఫన్నీగా చూపించారు. ముళ్ళపూడి రాజేశ్వరి, అభిజ్ఞ, జీవన్, కృష్ణ తేజ, విష్ణు, సంజయ్, స్వరూప్, రఘుబాబు, ప్రియాంక, స్వప్నిక, శివరంజని, తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు.