నోటికి వచ్చిన్నట్లు మాట్లాడే రోజా టోటల్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..? మేడమ్ గారు దొంగ లెక్క చెప్తున్నారా..?

కొద్దిరోజులే ..కేవలం కొద్ది రోజులు అంటే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి . ప్రెసెంట్ ఏపీలో పొలిటికల్ సిచువేషన్ ఏ విధంగా ఉందో మనకు తెలిసిందే. ఎప్పుడు ఎటువైపు నుంచి బిగ్ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి .. మరీ ముఖ్యంగా ఈసారి సినీ స్టార్స్ కూడా రాజకీయాలలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో సినీ ఇండస్ట్రీలో కూడా రాజకీయాలకు సంబంధించిన డీటెయిల్స్ వార్తలు వైరల్ అవుతున్నాయి . తాజాగా సోషల్ మీడియాలో ఏపీ మంత్రి ఆర్కే రోజా గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది . రోజా ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు .

సినిమా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలు రాజ్యమేలేసిన హీరోయిన్ . ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ కూడా చక్రం తిప్పుతుంది . ప్రస్తుతం తన జీవితాన్ని పూర్తిగా రాజకీయాలకు అంకితం చేసేసింది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు రోజా . మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసారు . అంతకుముందు అరా కోరా సినిమాలలో కనిపించే వాళ్ళు ..జబర్దస్త్ లో జడ్జ్ గా పని చేసేవారు ..కానీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పూర్తి కాన్సన్ట్రేషన్ ప్రజల పైన చేయాలి అంటూ సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారు .

ప్రజెంట్ నగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు . రోజా శుక్రవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు . కాగా అఫడి విట్ లో మంత్రి రోజా పేర్కొన్న ఆస్తుల వివరాలు ఇప్పుడు షాకింగ్ గా ఉన్నాయి . 2019లో ఆమె ఆస్తుల డీటెయిల్స్ 9.3 కోట్లు ఉండగా ఇప్పుడు 13 కోట్లకు పెరిగింది అంటూ అఫిడవిట్ లో రాశారు . ఇందులో చరాస్తులు ఐదు కోట్లు స్థిరాస్తులు ఏడు కోట్లు అంటూ తెలిపారు. కోటి విలువైన బెంజితో పాటు తొమ్మిది కార్లు ఉన్నాయి అని వెల్లడించారు . ఆమె ఇంటర్ చదివాను అని కూడా మెన్షన్ చేశారు .

అయితే రోజా ఆస్తి కేవలం 13 కోట్లేనా..? ఇది నమ్మశక్యంగా లేదు అంటున్నారు జనాలు. ఎక్కడికి వెళ్లాలన్నా కార్లలలో తిరిగే రోజా హై సెక్యూరిటీ మధ్య వెళ్లే రోజా ఆస్తులు ఇంత తక్కువ ..?అస్సలు నమ్మసక్యంగా లేదు అంటూ పలుగురు ట్రోల్ చేస్తున్నారు . మరి కొందరు ఇదంతా ఒరిజినల్ ఆస్తి అని .. బ్లాక్ మనీ ఆస్తి ఇంకా ఉంటుంది అని అది ఏ రాజకీయ నేత కూడా బయట పెట్టరు అని చెప్తున్నారు . మొత్తానికి రోజాని మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు..!!