“మీరు అనుకున్నట్లు ఇళయరాజా అంత మంచి వాడు కాదు”.. చెన్నై కోర్టులో సంచలన వ్యాఖ్యలు..!!

ఇళయరాజా …ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ప్రముఖ సంగీత దర్శకుడు ..అంతేకాదు కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ..సౌత్ ఫిలిం ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా రాజ్యమేలేస్తున్న పేరు ఇది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగానే అద్భుతమైన సినీ సంగీతాన్ని అందిస్తూ శ్రోతల మనసును దోచేసుకుంటున్నారు ఇళయరాజా . ఎవరికీ కూడా ఇళయరాజా పాటలు అంటే ఇష్టం లేవు అని చెప్పడానికి ఛాన్స్ లేదు . ప్రతి ఒక్కరి మొబైల్ లో కూడా ఇళయరాజా పాటలు వినిపిస్తూనే ఉంటాయి . ప్రేమ విరహ భక్తి మెలోడీ ఇలా ఆల్ టైప్ ఆఫ్ జువెలర్స్ కి సంబంధించిన ప్రతి పాటను తనదైన స్టైల్ లో ఆలపించి అభిమానులను మెస్మరైజ్ చేస్తూ ఉంటారు .

ఇప్పటివరకు ఆయన పలు భాషలలో వెయ్యికి పైగా సినిమాలకు సంగీతం అందించారు అంటే ఆయనకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు . ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు ఇళయరాజా . ఈ మధ్యకాలంలో వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు . తాజాగా మద్రాస్ హైకోర్టు ఇళయరాజా పై సంచలన కామెంట్లు చేసింది . మీరందరూ అనుకున్నట్లు ఇళయరాజా గొప్పవారే కానీ అందరికంటే గొప్ప వారేం కాదు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారంగా మారాయి . ఇళయరాజా పాటలను వాడుకునే ఒప్పందం గడువు పూర్తి అయిందని ఎకో రికార్డింగ్ తదితర సంస్థలపై ఇళయరాజా కాపీ హక్కులను కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే క్రమంలో ఆ సంస్థ కూడా చెన్నై హైకోర్టులో రీ పిటీషన్ వేశారు.

ఈ కేసును విచారించిన కోర్ట్ ఇళయరాజా పాటలు ఉపయోగించుకునే హక్కు ఆ రికార్డింగ్ సంస్థలకు ఉంది అని తీర్పు చెప్పేసింది . ఆశ్చర్యం ఏంటంటే కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఇళయరాజా తరఫున మరో పిటిషన్ దాఖలు వేశారు . ఈనెల 10వ తేదీ న్యాయమూర్తులు ఆర్ మహదేవ్ మహమ్మద్ షఫీ సమక్షంలో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఇళయరాజా తరుపున న్యాయవాది మాట్లాడుతూ ..”ఇళయరాజా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని గొప్పవారు అని అంటారు “..దానితో వెంటనే కలగజేసుకున్న న్యాయమూర్తి “ఆర్ మహదేవన్ సంగీత త్రిమూర్తులుగా ఉన్న సంగీత శిఖరాలు ముత్తుస్వామి దీక్షిత్ , త్యాగరాజన్ అందరికంటే గొప్పవారు ..ఇళయరాజా అంతకంటే గొప్పవారేం కాదులే ..మీ వాదనను మేము అంగీకరించలేమంటూ “స్ట్రైట్ ఫార్వార్డ్ గా చెప్పేశారు. దాంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారాయి . ఈ కేసు విచారణ 24వ తేదీకి వాయిదా వేశారు..!!