మరికొద్ది రోజుల్లో ఎలెక్షన్స్.. ఒక్క మాటతో ఏపీ రాజకీయాలను మలుపు తిప్పిన తారకరత్న భార్య..!

మనకు తెలిసిందే.. కేవలం కొద్ది రోజులే మరి కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మొదలవుతున్నాయి. దీనికి సంబంధించి పలు పార్టీస్ కూడా తమదైన స్టైల్ లో క్యాంపెనింగ్ చూసుకుంటున్నారు . మా పార్టీ గొప్ప అంటే మా పార్టీ గొప్ప ..మా పార్టీ ఈ పనులు చేస్తుంది .. ప్రజలకు సేవ చేస్తోంది అంటూ ఏ పార్టీ వాళ్ళ విధివిధానాలను వాళ్ళ మేనిఫెస్టోలను జనాలకు తెలియజేసేలా ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి క్రమంలోనే నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది ..? టిడిపికా..? వైసిపికా ..?అంటూ గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది .

తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి దగ్గర బంధువు అన్న విషయం అందరికీ తెలిసిందే . తారకరత్న చనిపోయినప్పుడు కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్ని పనులను దగ్గరుండి చూసుకున్నారు . ఈ క్రమంలోనే అలేఖ్య రెడ్డి ఆయనకే సపోర్ట్ చేస్తుంది అని వైసిపి పార్టీ తరపున ఆమె ప్రచారం చేస్తుంది అని జనాలు అనుకున్నారు. అయితే తారకరత్న భార్య మాత్రం షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది . మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ అనగా సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ ఫోటోలు షేర్ చేసింది . బాలయ్య మోక్షజ్ఞతో తారకరత్న పిల్లలు ఆమె కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ సంచలన విషయాన్ని బయటపెట్టింది.

” అందరూ అడుగుతున్నారు నేను ఏ వైపు ఉన్నాను అని .. నన్ను ఎప్పుడు అడుగుతూనే వస్తున్నారు కదా.. ఇదే నా సమాధానం.. మానవత్వం , ప్రేమ ముఖ్యంగా నా కుటుంబం ఏ వైపు ఉంటే మావయ్య బాలయ్య ఏ పైపులు ఉంటే అటువైపు గానే ఉంటాను .. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను ..ఓబు, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాము “అంటూ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సపోర్ట్ చేసేది టిడిపికే అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఈ ఫోటోలో అలేఖ్యరెడ్డి పెద్ద కూతురు ఎల్లో షర్ట్ ధరించడం అందరికీ ఆమె సపోర్ట్ చేసేది టిడిపికి అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. ఒకే ఒక్క పోస్ట్ తో అలేఖ్య రెడ్డి ఏపీ పొలిటికల్ చరిత్రను భవిష్యత్తును తిరగరాసేసింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..!