వాట్.. బన్నీ ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడా.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్‌ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా పుష్ప సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్న మొదటి స్టార్ హీరోగా రికార్డ్‌ సృష్టించిన సంగతి తెలిసిందే. హీరోగా భారీ విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్.. తన సినీ కెరీర్ స్టార్టింగ్ లో ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారట. శ్రీకాంత్, వేణు, సునీల్ ప్రధాన పాత్రలో నటించిన పెళ్ళాం ఊరెళితే సినిమా అప్పట్లో ఎలాంటి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Pellam Oorelithe (2003) - Posters — The Movie Database (TMDB)

ఎస్‌వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తమిళ్‌లో హిట్ గా నిలిచిన చార్లీ చాప్లిస్ మూవీకి రీమేక్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రొడ్యూసర్లలో అల్లు అరవింద్ కూడా ఒకరు. ఈ నేపథ్యంలో ఆయ‌న సూచనల మేరకు సినిమాకు బన్నీ అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించాడట. అదే టైంలో బన్నీకి.. ఎస్వి కృష్ణారెడ్డి అంటే ఎంతో భయం ఉండేదట. ఈ విషయాన్ని ఎస్‌వి కృష్ణారెడ్డి ఓ సందర్భంలో స్వయంగా వివరించాడు. అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం పుష్పీ 2 షూట్‌లో బిజీగా గడుపుతున్న బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్టులతో కూడా భారీ పాన్‌ ఇండియా లైనప్ ఏర్పాటు చేసుకున్నాడు.

S.V. Krishna Reddy : స్వర విన్యాసాల కృష్ణారెడ్డి! - NTV Telugu

ఇక ఈ సినిమా హిందీ హక్కులు, ఓటీటీ హక్కులు రికార్డ్ ధరకు అమ్ముడుపోయాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా బిజినెస్ విషయంలో మేకర్స్ పూర్తిస్థాయిలో సంతృప్తి చెందుతున్నారట. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులకు కూడా గట్టి పోటీ ఏర్పడింది. కొన్ని ఏరియాలో మైత్రి నిర్మాతలు సంవ‌త‌హాగా ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నార‌ట‌. ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో టార్గెట్ ను రీచ్ అవ్వడానికి మేకర్స్ మరింత శ్రమిస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమా టాక్ ను బట్టి బన్నీ మార్కెట్ ఏ రేంజ్‌కు విళ్ళ‌నుంది అనే విష‌యంపై క్లారిటి వ‌స్తుంది.