ఈ పై ఫోటోలో కనిపిస్తున్న సిద్ధార్థ్ హీరోయిన్ ని గుర్తుపట్టారా.. అక్క, బావ కూడా స్టార్ సెలబ్రిటీలే..?!

ఇండ‌స్ట్రీలో హీరో, హీరోయిన్లకు, న‌టీ, న‌టుల‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప‌న‌వ‌స‌రంలేదు. గతంలో అయితే ఎలాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ అందుబాటులో లేక‌పోవ‌డంతో సెలబ్రిటీలు ఏం చేసినా.. అదొక సంచలనంగా అప్ప‌టి జ‌నం భావించేవారు. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగం విప‌రీతంగా ఉండ‌టంతో.. సోషల్ మీడియా వాడకం అధికం అయ్యింది.. తమ అభిమాన‌ హీరో, హీరోయిన్ల అప్‌డేట్స్ క్షణాల్లో మొబైల్‌లో తెలిసిపోతున్నాయి. తమ గ్లామరస్ ఫోటో షూట్స్, ఫ్యామిలీ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు సెల‌బ్రెటీస్‌. ఈ కోవలోనే తాజాగా ఓ యాక్ట్రెస్ ఫోటో ఇటీవ‌ల నెట్టింట వైరల్‌గా మారింది.

Shamili | Rajanadai | Kollywood stars who started off as child artists

చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సుమారు 11 ఏళ్లు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఏర్ప‌రుచుకుంది. అలాగే ప్రధాన నటిగా నాలుగు సినిమాల‌లో చేసింది. ఇంత‌కి ఈమె ఎవరో గుర్తుపట్టారా..? ఈమె అక్క, బావ కూడా ఇద్దరూ హీరో, హీరోయిన్లే. తమిళ్‌ సూపర్ స్టార్స్. ఇప్పటికైనా గుర్తుప‌ట్టారా..? ఎవరో చెప్పగలరా.. ఆమె ఎవ‌రోకాదు షామిలీ. 1989లో రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘మగాడుస సినిమాతో టాలీవుడ్‌కి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Oy! (2009) - Posters — The Movie Database (TMDB)

ఆ తర్వాత సంవత్సరమే ‘అంజలిస సినిమాలో నటించి త‌న న‌ట‌న‌త‌త‌తో ఆక‌ట్టుకుంది. నేషనల్ అవార్డు అందుకుంది. ‘కీచురాళ్లు’, ‘నిప్పు రవ్వ’, ‘నిర్ణయం’, ‘జోకర్’ లాంటి వ‌రుస సినిమాలతో మంచి పేరు సంపాదంచుకుంది. ఇక 2006లో సిద్ధార్ద్ హీరోగా వచ్చిన ‘ఓయ్’ తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. చివరిగా 2018లో ‘అమ్మగారి ఇల్లుస మూవీలో కనిపించింది. ఇటీవల ఆమె లేటెస్ట్ ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అంతా ఈమె షామిలినా అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మ‌రీ ఇంత‌లా మారిపోయిందేంటి..అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.