పెళ్లయిన తర్వాత మొదటిసారి అలాంటి పనికి సిద్ధమైన సూర్య – జ్యోతిక.. పండగ చేసుకుంటున్నా ఫ్యాన్స్..?!

కోలీవుడ్ స్టార్ కపుల్ జ్యోతిక – సూర్యకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరు 1999లో రిలీజైన పూవెల్ల‌మ్ కెట్టాపార్ సినిమాతో మొదటిసారి కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత ఊయిరిలే కాలందదు, పేరళ‌గన్, కాక్క కాక్క‌, సిల్ల‌ను ఒరు కాద‌ల్‌, మాయావి లాంటి సినిమాలతో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా వ‌రుస సినిమా షూట్ల‌తో వీరిద్దరి మధ్యన స్నేహం బలపడి అది ప్రేమగా మారడంతో.. 2006లో పెద్దలను ఒప్పించి ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత జ్యోతిక నటనకు కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే.

Jyothika | Suriya | Jyothika And Surya Together | Suriya And Jyothika Movies  | Suriya Films With Jyothika | Surya In Masss | List Of Suriya And Jyothika  Movies - Filmibeat

ఇక ఇటీవల 36 వయ‌దినిలే సినిమాతో హీరోయిన్గా రీఎంట్రీ ఇచ్చింది జ్యోతిక. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. దీంతో మంచి కంటెంట్ ఉన్న లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక అక్కడ అజయ్ దేవగణ్ స‌రస‌న‌ నటించిన సైతాన్ సంచలన రికార్డ్స్ సృష్టించింది. ఇక మలయాళం లోను మమ్ముట్టి కి జంటగా కాదల్ ది కోర్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇకపోతే సూర్య సురరైపోట్లు, జై భీమ్ లాంటి విజయవంతమైన సినిమాల తర్వాత ప్రస్తుతం కంగువా సినిమా పూర్తిచేసుకుని కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో మరో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు.

Jyothika | Suriya | Jyothika And Surya Together | Suriya And Jyothika  Movies | Suriya Films With Jyothika | Surya In Masss | List Of Suriya And  Jyothika Movies - Filmibeat

వీటితో పాటు సూర్య లైన్ అప్ లో మ‌రిన్ని సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల తరువాత పెళ్లైన మొదటిసారి సూర్య – జ్యోతిక మరోసారి జంటగా నటించబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మూవీకి సిల్లు కరుప్పట్టి డైరెక్టర్ హలితా షమీమ్, లేదా బెంగళూరు డేస్ మూవీ డైరెక్టర్ అంజలి మీనన్ దర్శకత్వం వహిస్తారు అంటూ తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వెలవడనుందట. ఇది ఓకే అయితే పెళ్లి తర్వాత సూర్య, జ్యోతికా కలిసి నటించే మొదటి సినిమా ఇదే అవుతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ వైర‌ల్ అవ్వడంతో చాలా ఏళ్ల తర్వాత మరోసారి తమ అభిమాన జంటను కలిసి చూడబోతున్నాం అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.