“సదా-రాధ వేస్ట్..ఓవర్ యాక్టింగ్”.. స్టార్ నటి కూతురు సంచలన పోస్ట్ వైరల్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయాన్ని ఓపెన్ గా చెప్పడం అలవాటుగా మారిపోయింది. రీసెంట్గా అలాంటి ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . మనకు తెలిసిందే బుల్లితెరపై పలు టిఆర్పి రేటింగ్స్ కోసం కొత్త డ్రామాలు సరికొత్త ఓవరాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా కొన్ని డాన్స్ షోలో ఆల్రెడీ స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తూ ఉంటాయి అంటూ కూడా బాగా టాక్ వైరల్ గా మారింది .

తాజాగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది. ప్రముఖ డాన్స్ షో కి సంబంధించి.. నటి ఉమాదేవి కూతురు తనూష సంచలన కామెంట్స్ చేసింది. నీతోనే డాన్స్ షోలో జోడీలుగా ఉన్న ఒక కంటెస్టెంట్స్ పై అలాగే జడ్జి జడ్జిమెంట్ పై స్ట్రాంగ్ అకౌంటర్స్ వేసింది. “స్టార్ మా వాళ్ళు నీతోనే డాన్స్ అనే ప్రోగ్రాం చేస్తున్నారు. అసలు డాన్స్ రాని వాళ్ళు కూడా ఎలా ఈ ప్రోగ్రాం కి సెలెక్ట్ అయ్యారు.. అనేది తెలీదు.

“లిప్ సింక్ ఉండదు .. జంటల మధ్య సింక్ ఉండదు.. అంతా గజిబిజి గందరగోళం కానీ జడ్జెస్ మాత్రం వాళ్లనే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు . బిగ్ బాస్ నేహా చౌదరి విశ్వ జంట ప్రతిసారి జిమ్నాస్టిక్స్ చేస్తారు .. ఎవరికైనా టాలెంట్ ఉంటుంది యూస్ చేసుకోవచ్చు .. కానీ ప్రతిసారి ఒకే డాన్స అది ఎంతవరకు కరెక్ట్..? జడ్జిలు ఈ విషయాన్ని గమనించరా..? పనికిమాలిన జడ్జిమెంట్ అంటే ఇదే.. ఏదో జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అంటూ టిఆర్పి రేటింగ్స్ కోసం ఇలా చేస్తారా..?” అంటూ మండిపడింది . దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ గా మారింది..!