“ఫైనల్లీ..ఆ టైం వచ్చేసిందోచ్”.. కోట్లాది మంది కోరికను నిజం చేయబోతున్న జాన్వీ కపూర్..!

జాన్వి కపూర్ .. అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా బాగా పాపులారిటి సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాల్లో చేసినా రాని క్రేజ్ గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ సినిమాలో నటించబోతుంది అని తెలియడంతోనే దక్కించుకుంది . కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర అనే సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది.

ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వనే లేదు . అప్పుడే మరో బడా సినిమాలో అవకాశం దొరికించుకుని షాక్ ఇచ్చింది . రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది . అంతేనా ఈ రెండు సినిమాల సెట్స్ పై ఉండగానే మరో బ్లాక్ బస్టర్ కాంబోలో అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

జాన్వీ కపూర్ ప్రభాస్ సరసన నటించబోతుందట . అది కూడా హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో అంటూ ప్రచారం జరుగుతుంది . హనురాగవపూడి ఎలా హీరోయిన్స్ ని హైలెట్ చేస్తాడో..తన సినిమాలో మనకు బాగా తెలిసిన విషయమే. అయితే అలాంటి డైరెక్షన్ లో నటించే ఛాన్స్ దక్కించుకోవడంతో జాన్వి కపూర్ నొ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు . అమ్మడు మహా లక్కి అంటున్నారు . చరణ్తో నటించిన జాన్వీను ఎప్పుడూ మా ప్రభాస్ అన్నతో నటిస్తావ్ అంటూ జనాలు సూటిగా ప్రశ్నించారు . దీంతో అలాంటి వాళ్లకు అద్దిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వబోతుంది జాన్వీ అంటూ ప్రచారం జరుగుతుంది..!