హేమచంద్రతో శ్రావణ భార్గవి విడాకులు.. ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చిన సింగర్..!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువగా మనం చూస్తున్నాం . దానికి సంబంధించిన విషయాలకు కూడా తరచూగా వింటూ వస్తున్నాము. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక స్టార్ సెలబ్రిటీ కి సంబంధించిన విడాకుల విషయం మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ సింగర్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న హేమచంద్ర .. అలాగే శ్రావణ భార్గవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఈ విషయం మనందరికీ తెలిసిందే .

శ్రావణ భార్గవి హేమచంద్రాలకు ఒక పాప కూడా పుట్టింది . ఆమె పేరు శిఖర. చాలా అన్యోన్యంగా సాగిపోతున్న వీళ్ల సంసారంలో ఏవో మిస్ అండర్స్టాండింగ్ వచ్చాయి. ఆ కారణంగానే విడాకులు తీసుకున్నారు అంటూ ప్రచారం జరిగింది . అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ గా స్పందించలేదు ఈ జంట . కానీ దూరం గానే ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా హేమచంద్ర శ్రావణ భార్గవి కలిసి కనిపించిన ఫొటోస్ దాఖలాలు లేవు.

మరీ ముఖ్యంగా శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానల్లో కేవలం తనకు తన కూతురికి సంబంధించిన విషయాలు మాత్రమే పెడుతూ ఉండడంతో ఆల్మోస్ట్ ఆల్ వీళ్లు విడాకులు తీసుకున్నారు అని ఫిక్స్ అయిపోయారు జనాలు . తాజాగా సోషల్ మీడియాలో శ్రావణ భార్గవి పెట్టిన పోస్ట్ వీళ్లు విడిపోయారు అనే విషయాలని చెప్పకనే చెప్తూ కన్ఫామ్ చేసేసింది . శ్రావణ భార్గవి తన కూతురుతో టూర్ వెళ్తుంది . దీనికి సంబంధించి కొన్ని ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది . ఈ ఫొటోస్ చూసిన జనాలు హేమచంద్ర అన్న ఎక్కడ..? అంటూ ప్రశ్నిస్తున్నారు . మరి కొందరు వాళ్ళు విడిపోయి చాలా కాలమే అవుతుంది కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పడం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు. మొత్తానికి శ్రావణ భార్గవి హేమచంద్ర విడాకుల మేటర్ మరోసారి నెట్టింట వైరల్ గా మారింది..!!