విజయ్ దేవరకొండకు అలాంటి హెల్ప్ చేసిన ప్రభాస్..ట్రెండ్ చేస్తున్న రెబల్ ఫ్యాన్స్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు ప్రభాస్ బిగ్ హెల్ప్ చేశాడా..? అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది . సాధారణంగా ప్రభాస్ పక్క సినిమాల విషయంలో చాలా లైట్ గా ఉంటాడు . హెల్ప్ చేయడం అలాంటివి చేయడు. ఓ సాఫ్ట్ నేచర్.. ప్రభాస్ని హెల్ప్ చేయమని అడిగిన వాళ్లకు కచ్చితంగా హెల్ప్ చేస్తాడు .

అలా మనం చాలా సినిమాల విషయాలలో చూసాము.. గతంలో ఆయన పలు సినిమాలను ప్రమోట్ కూడా చేశారు . అయితే రీసెంట్గా విజయ్ దేవరకొండ సినిమాకు ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ . ఈ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే కొంతమంది జనాలకు ఈ సినిమా పెద్దగా నచ్చలేదు .

ఫ్యామిలీ స్టార్ సినిమా విజయ్ దేవరకొండ రేంజ్ కాదు అంటూ ఓపెన్ గానే చెప్పేస్తున్నారు . అయితే సినిమా మరి కొద్ది గంటల్లో రిలీజ్ అవుతుంది అనగా ప్రభాస్ విజయ్ దేవరకొండకు అలాగే ఫ్యామిలీ స్టార్ సినిమాకు బెస్ట్ విషెస్ అందించారు . దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ బాగా ట్రెండ్ అవుతున్నయ్. చాలా రేర్ గా మాత్రమే ప్రభాస్ ఇలా చేస్తూ ఉంటాడు అంటూ రెబెల్ ఫ్యాన్స్ ఈ వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు. ప్రజెంట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కల్కి. ది రాజా సాబ్ సినిమా షూట్స్ లో బిజీగా ఉన్నాడు . ఈ రెండు కంప్లీట్ అవ్వగానే స్పిరిట్ సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు..!