విగ్నేష్ మోజులో పడి మాజీ ప్రియుడి పుట్టినరోజును మర్చిపోయిన నయనతార.. ఆఖరికి ఆ ఒక్క పని కూడా చేయలేదుగా..!

నయనతార.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. ఈ భామ బాలీవుడ్ భామ అయినప్పటికీ టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. కొన్ని దశాబ్దాల కాలం నుంచి తనదైన నటనతో ప్రతి ఒక్కరినీ మైమరిపిస్తుంది. తనకి నచ్చిన తనని మెచ్చిన పాత్రలను ఎంచుకుంటూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ పెళ్లయిన నాటి నుంచి నిత్యం ఏదో ఒక వార్తలో నిలుస్తూనే ఉంది.

దర్శకుడు విగ్నేష్ శివన్ నీ పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ ఇద్దరి కమల పిల్లలకి అది గర్భం ద్వారా కూడా తల్లి అయింది. ఇక పెళ్లి అనంతరం అనేక కష్టాలను అనుభవించింది నయనతార. ఇక ఇటీవల వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ అనేక ప్రచారాలు సైతం జరిగాయి. దీనికి కారణం ఈమె తన ఇంస్టాగ్రామ్ నుంచి విగ్నేష్ ని ఆన్ ఫాలో కొట్టడమే. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు నయనతార ఏ పని చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

ఇక గతంలో ప్రభుదేవా కి నయనతార కి రిలేషన్షిప్ ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ అనంతరం వీరిద్దరూ విడిపోయారు. ఇక నిన్న ప్రభుదేవా పుట్టినరోజు. కొన్ని సంవత్సరాలు ప్రేమించుకుని బ్రేకప్ అయినప్పటికీ పుట్టినరోజు నాడు ఎవరైనా విషెస్ తెలియజేస్తారు. కానీ నయనతార మాత్రం ఆ పని అస్సలు చేయలేదు. ప్రభుదేవా కి విషెస్ తెలియజేయకపోవడంతో ఆయన ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు రాసుకుని పూసుకుని తిరిగి ఇప్పుడు ఎవరో తెలియనట్లు బిహేవ్ చేస్తున్నావంటూ మండిపడుతున్నారు కూడా.