అర్ధ రాత్రి రోడ్డు పై అలాంటి పని చేస్తూ ఎంజాయ్ చేసిన స్టార్ డైరెక్టర్ భార్య..వీడియో వైరల్..!

నయనతార.. సౌత్ ఇండియాలోనే క్రెజియస్ట్ హీరోయిన్ ..ఒక్కొక్క సినిమాకు 10 నుంచి 15 కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ అందుకుంటూ.. స్టార్ హీరోయిన్గా రాజ్యమేలుస్తుంది . ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక పక్క ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది. కాగా ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న నయనతార ఇద్దరు పిల్లలకు కూడా తల్లి అయ్యింది. మదర్ హుడ్ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది.

ఫ్యామిలీ మూమెంట్స్ కి సంబంధించిన పిక్చర్స్ ను వీడియోస్ ను సోషల్ మీడియాలో తక్కువగా షేర్ చేసే నయనతార కి సంబంధించిన కొన్ని పిక్స్ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . నయనతార తన స్నేహితులతో కజిన్స్ తో అర్థరాత్రి రోడ్ సైడ్ ఐస్ క్రీమ్ తింటూ బాగా ఎంజాయ్ చేసింది . ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది .

ఈ వీడియోని నయనతార భర్త విగ్నేష్ శివన్ రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. నయనతార ఐస్ క్రీమ్ తింటూ ఉండగా అక్కడే ఆపోజిట్లో ఆమె ప్రమోట్ చేసిన ఒక జ్యూవెలరీ బ్రాండ్ ఉంది . ప్రస్తుతం ఈ ఫోటో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . స్టార్ స్టేటస్ ఉన్నా కూడా చిన్న చిన్న ఆనందాలను ఎంజాయ్ చేయడంలో నయనతార ఎప్పుడూ కూడా మిస్ చేసుకోదు అంటూ పలువురు ఆమె ని పొగిడేస్తున్నారు.

ప్రజెంట్ నయనతార పలు తెలుగు – తమిళ – సినిమాలతో బిజీబిజీగా ముందుకెళ్తుంది . తెలుగులో మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించబోతుంది అంటూ సమాచారం అందుతుంది . అంతేకాదు త్వరలోనే నయనతార మరో బిగ్ ప్రాజెక్టులో కూడా భాగం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!