ప్రతిరోజు ఉదయాన్నే సోంపు వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకొండి..?!

వేసవిలో ఎండ వేడిమి డిహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది నిమ్మరసం, షర్బత్, సుగంధి, సత్తు, చెరుకు రసం లాంటి ఎన్నో పానీయాలను తీసుకుంటూ ఉంటారు. ఇవి శరీరానికి రెట్టింపు ప్రయోజనాలను కలిగిస్తుందని వారు నమ్ముతారు. వాటితో పాటే వేసవిలో ఉపశమనాన్ని అందించే సోప్ వాటర్ తాగడం వల్ల కూడా శరీరానికి ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు. అయితే రోజు ఉదయాన్నే సోపు వాటర్ ని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తుంది. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

సొంపు వాటర్ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. కూలింగ్ ఎఫెక్ట్‌ని కలిగి ఉండడంతో శరీరానికి చలువ చేస్తుంది. డిహైడ్రేషన్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఈ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. పలు విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ వాట‌ర్‌ శరీరానికి అన్ని విధాల సహకరిస్తాయి. అలాగే సోంపు జీర్ణశక్తి మేరుగు పరచడానికి.. ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించే శక్తిని పెంచడానికి.. సహకరిస్తుందని నిపుణులుచెప్తున్నారు. ఇక జింక్, ఫాస్ఫరస్, సెలీనియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ అధిక మోతాదులో సోంపు తినడం వల్ల శరీరానికి లభిస్తాయట.

ప్రతిరోజు వీటిని న‌మిలి తినడం వల్ల శరీరంలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సోంపు సహకరిస్తుంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఉదయాన్నే సోంపు వాటర్ తాగడం వల్ల శరీర బరువును నియంత్రించేందుకు.. ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడంతో పాటు.. శరీరంలో వేడిని అదుపులో వుంచి డైజెషన్‌ను మెరుగుపరుస్తుంది. కడుపు నిండుగా ఉంచడంతో ఆకలి తక్కువగా అనిపించడం.. శరీరానికి కావాల్సిన శక్తి వేగంగా అందడానికి సోంపు తోడ్పడుతుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేట్‌ కాకుండా ఉండాలంటే ఈ సోంపు వాటర్ అలవాటు చేసుకోవడం మంచిది.