వామ్మో.. గురక కారణంగా ఇన్ని జంటలు విడిపోతున్నారా.. లేటెస్ట్ రిపోర్టులో షాకింగ్ నిజాలు..

ప్రస్తుత లైఫ్ స్టైల్‌, తీసుకునే ఆహారాన్ని బట్టి.. గురక సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. వయసు పెరుగుతున్న కొద్ది ప్రతి ఒక్కరిలోనూ ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. గురక కారణంగా జంటలు విడాకులు తీసుకునే స్టేజ్ వరకు వెళ్తుంది. అయితే ఇటీవల అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ సంచలన రిపోర్ట్ ను రివిల్ చేసింది. కేవలం గురక కారణంగానే అమెరికాలో చాలామంది జంటలు ఒకరి నుంచి ఒకరు విడాకులు తీసుకుంటున్నారట. అక్కడ జంటలో విడాకులకు గుర‌క‌ అనేది మూడవ అతిపెద్ద కారణం అని రిపోర్ట్లో వెల్లడించారు. భారత్‌లో గురక సమస్య పెరుగుతుంది. దేశంలో దాదాపు 20 శాతం మంది నిద్రిస్తున్న సమయంలో గురక పెడతారు. అయితే భారతదేశంలో ఇలాంటి సమస్య కారణంగా విడాకులు తీసుకోరు. కానీ ఖచ్చితంగా వీరి మధ్య సంబంధాలలో మనస్పర్ధలు ఏర్పడుతున్నాయట.

అయితే ప్రముఖ డాక్టర్ జుగల్ కిషోర్ మాట్లాడుతూ గురక గురించి ఎన్నో షాకింగ్ విషయాలను రివీల్ చేశాడు. గురక అనేది సాధారణంగానే అందరిలో కనిపిస్తుందని.. గాఢ నిద్రలో నోటిలోకి, నాలుక గొంతు కండరాలు సడలించినప్పుడు గురక వస్తుందని.. కొంతమందిలో గొంతు కణజాలం శ్వాసకోశ‌ని ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని.. దీని కారణంగానే ముక్కు, నోరు కనిపించి ధ్వని గురక రూపంలో బయటపడుతుందని చెప్తున్నారు. గురకకు ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది స్లీపర్ సమస్య.. అంటే నిద్ర సంబంధిత రుగ్మత. అంతే కాకుండా గురకకు మరో ప్రధాన కారణం సైనస్. సైనస్ సమస్య బారిన పడిన వారికి సాధారణంగా గురక ఎక్కువగా వస్తూ ఉంటుందట.

సైనస్‌ సమస్యను సాధారణంగా భావించి చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ సమస్యకు కచ్చితంగా చికిత్స అవసరమని ఆరోగ్య పరిస్థితి బ‌ట్టి జీవన స్థాయిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అయితే దీనికంటే ముందే వ్యక్తి గురక సమస్యను ఓ వ్యాధిగా పరిగణించి.. చికిత్స పొందాలని చెప్తున్నారు. శ్వాస సమస్య ఎక్కువగా రెనిటైటీస్ లేదా సైనసైటిస్, వాపు ట్రాన్సిల్స్ లాంటి సమస్యల కారణంగా తలెత్తుతుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారికి నిద్ర వేళ‌కు ముందు బరువు తగ్గడం.. ధూమపానం మానేయడం.. ఆల్కహాల్ తాగడం మానేయడం.. లాంటి సలహాలు ఇస్తూ ఉంటారు నిపుణులు. గొంతు నుండి కొన్ని కణజాలాలను తగ్గించడం వల్ల గురక సమస్యకు చెక్ పెట్టవచ్చు.