ప్రస్తుతం కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రష్మిక ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందనకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన‌న ప‌ని లేదు. మొదట కన్నడ నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. ఈరోజు 28 పుట్టినరోజు జరుపుకుంటుంది. మోడల్గా కెరీర్ ప్రారంభించిన రష్మిక కిర్రాక్ పార్టీ సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత ఛ‌లో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి గీత గోవిందం, సరిలేరు నీకెవరు, పుష్ప, యానిమల్ లాంటి సినిమాలతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. తన పట్ల పలు రకాలుగా రూమర్స్, ఢీప్ ఫేక్ వీడియోస్ లాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చిన స్ట్రాంగ్ ఉమెన్ గా నిలబడింది. పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకుంది.

అయితే రష్మిక చిన్నప్పుడు తన కుటుంబం మొత్తం అదే ఇంట్లో ఉండేవారిమని.. ఓ ఇంటర్వ్యూలో వివరించింది. ఫైనాన్షియల్ ఇబ్బందుల కారణంగా రెంట్ కట్టలేకపోయామని.. పదే పదే ఇళ్లు మారాల్సి వచ్చేదని చెబుతూ కంటతడి పెట్టుకుంది. ఆమె ఆడుకోవడానికి ఒక్క బొమ్మను కూడా తల్లిదండ్రులకు లేకపోయారని చెప్పుకొచ్చింది. పాఠశాల రోజుల్లో తన కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని.. వ్యాపారాల్లో కూడా నష్టం వచ్చి నాన్నగారు బాధలు పాడిన సందర్భాలు చాలా ఉన్నాయి అంటూ వివరించింది. ఎలాగైనా ఈ పరిస్థితులు మార్చాలని అనే బలంగా కోరుకుందట.

దానికి తగ్గట్టుగా శ్రమించారు.. తల్లిదండ్రులకు ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా ధైర్యంగా ముందడుగు వేసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు తండ్రికి బిజినెస్ ఫైనాన్షియల్ గా కూడా సహాయం చేస్తుంది. అలానే ఓ పెద్ద ఇల్లును కూడా తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చింది. కిర్రాక్ పార్టీ సినిమాతో మొదట సక్సెస్ అందుకున్న రష్మిక తర్వాత ఛ‌ల్లో సినిమాలో అవకాశం దక్కించుకుంది ఇక ఇండస్ట్రీలోకి వచ్చే ముందే ఇండస్ట్రీలో ఉండే సాధక బాధలన్నీ రష్మిక తెలుసుకుంది. రంగుల కలలను కనకుండానే ప్రతి వృత్తిలో ఉన్నట్టే సినీ రంగంలో కూడా వడుదొడుకులు, ఎదురుదాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫిక్సై ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆమెపై ఎన్ని రూమర్స్ వచ్చిన స్ట్రాంగ్ గా నిలబడింది.

అయితే ప్రస్తుతం కోట్లలో సంపాదిస్తున్న రష్మిక.. కిర్రాక్ పార్టీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో.. రూ.1.50 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ గా అందుకుందట. ఆ తర్వాత చ‌ల్లో సినిమాకు రూ.50 లక్షలు అందుకున్నారని టాక్. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.5 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటుంది. కాగా యానిమల్ సినిమాకు రూ.7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక ఓ ప‌క్క‌ సినీ రెమ్యూనరేషన్‌తో పాటే పలు ప్రకటనలలో నటిస్తూ ఒక్కో ప్రకటనకు రూ.70 లక్షల వరకు చార్జ్‌ చేస్తుందట. అలా ప్రస్తుతం రష్మిక రూ.70 కోట్ల వరకు ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది.