ఛడీ.. చప్పుడు.. లేకుండా స్టార్ట్ అయిపోయిన బాలీవుడ్ ‘ రామాయణ్ ‘.. సాయి పల్లవి రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోది.. ?!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి డైరెక్షన్లో రామాయణం సినిమా రూపొందుతుందంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ సినిమా గురించి ఎవరు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. వెయ్యి కోట్ల తో ఈ సినిమా వ‌స్తుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ భారీ బడ్జెట్ రామాయణం ఉంటుందా.. లేదా.. అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి క్రమంలో రామాయణ్‌న్ని తీసే విధానంలో తీస్తే ఎన్నిసార్లు అయినా చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటామంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆది పురుష్‌ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కి ఎలాంటి రిజల్ట్ అందుకుందో.. దానికి ఏ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయో అందరికీ తెలుసు.

అలాంటి క్రమంలో రామాయణం తీయాలంటే ఎంత స్టార్ డైరెక్టర్ అయినా ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో నితీష్ తివారి ప్లాన్ చేస్తున్న రామాయణం ఎలా ఉంటుందో అనే అంశంపై ప్రేక్షకుల ఆసక్తి మొదలయింది. ఇక బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ గురించి ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. బ్లాక్ బస్టర్ దంగల్ మూవీ డైరెక్టర్ నితీష్ తివారి స్క్రిప్ట్ పైన పని మొదలుపెట్టారు. తాజాగా ఈ ప్రాజెక్టు పై కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ రామాయణం దాదాపు వెయ్యు కోట్లతో మూడు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారట. ఇందులో రాముడిగా ర‌ణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా య‌ష్‌ నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ ఓపెనింగ్ తాజాగా ముంబైలో జరిగింది. మొదటి స్కెడ్యూల్ ప్రారంభమైపోయిందని.. త్వరలోనే రణ్‌బీర్‌, సాయి పల్లవి సెట్స్‌లో జాయిన్ కానున్నారని తెలుస్తోంది. 2025 డిసెంబర్‌లో ఈ రామాయణం ఫ‌స్ట్ పార్ట్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారట. ఇక సీత పాత్రలో నటించేందుకు ఈ భారీ ప్రాజెక్టు కోసం సాయి పల్లవి సాధారణంగా తీసుకునే రెమ్యూనరేషన్కు రెట్టింపు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. తెలుగు లేదా తమిళ్ సినిమాలకు ఆమె వసూలు చేసే మొత్తానికి రెట్టింపులో ఈ సినిమాతో అందుకుంటుందట. ఇక బహుళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుండడంతో.. ఈమెకు పారితోషకం కూడా అదే రేంజ్ లో ఉండనుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు సాయి పల్లవి మరో బాలీవుడ్ మూవీ.. అమీర్ ఖాన్ కుమారుడు జుహీద్ ఖాన్ నటిస్తున్న సినిమాలను నటిస్తుంది. అలాగే తెలుగులో తండేల్ సినిమాలో కనిపించనుంది.