యానిమల్ ట్రోల్స్ పై రష్మిక ఫ‌స్ట్ రియాక్షన్ ఇదే.. స్ట్రాంగ్ కౌంటర్.. ఇక నోర్లు ముయ్యండ్రా..?!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన మూవీ యానిమల్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో విభిన్న కథ తెరకెకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో రష్మిక ఒకచోట డైలాగ్ సరిగ్గా చెప్పలేదని చాలామంది బహిరంగంగానే ట్రోల్స్ చేశారు. తాజాగా దీనిపై ఆమె రియాక్ట్ అవుతూ ఆడవాళ్ళ శరీరాకృతి పై ట్రోల్స్ చేస్తూ.. ఆనందాన్ని పొందే వాళ్ళని చూస్తే నాకు అసహ్యంగా ఉంటుంది. యానిమల్ లో కొన్ని సన్నివేశాల్లో నా ముఖం, నటన, డైలాగ్ డెలివరీ బాలేదని నన్ను కొంతమంది విమర్శించారు. అందులో కార్వా చౌత్ సీన్ ఒక‌టి.

ఇది సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ సీన్‌లో నేను ఎంతో కష్టపడి నటించా. ఆ ఒక్క సీన్లోనే ఎన్నో రకాల ఎమోషన్స్ పలికించాల్సి వచ్చింది. అందులో నా నటన చూసి సెట్స్‌ లో వాళ్లంతా చప్పట్లు కొట్టారు. థియేటర్ల లోనూ అలాంటి రెస్పాన్స్‌ఏ దక్కింది. విచిత్రం ఏంటంటే చాలామందికి నచ్చిన ఆ సీన్‌పై కూడా కొందరు విమర్శలు చేశారు. తొమ్మిది నిమిషాల సీన్ లో 10 సెకండ్ల డైలాగ్ బాలేదని విపరీతంగా ట్రోల్స్ చేశారు. వాటిని నేను పట్టించుకోను.. ఎందుకంటే నేను గిరి గిసుకుని ఉండాలని భావించడం లేదు.. ఎవరి ఇష్టం వాళ్ళది.. అందరికీ అన్ని నచ్చాలని రూలేమీ లేదు కదా అంటూ చెప్పుకొచ్చింది.

ఇక గతంలో సందీప్ రెడ్డి కూడా ఈ సీన్ పై మాట్లాడుతూ.. యానిమల్ లో గీతాంజలి రోల్ అనేది చాలా కష్టమైన పాత్ర. ఒక సన్నివేశంలోనే ఎన్నో హవ భావాలు పలికించాల్సి వస్తుంది. నవ్వడం, అరవడం, పిచ్చి పట్టినట్లు ప్రవర్తించడం, ఏడ‌వ‌టం ఇలాంటివన్నీ ప్రేక్షకులకు చూపించాలి. రష్మిక దానిని బాగా ఇంప్లిమెంట్ చేసిందంటూ ఆమెపై ప్రశంసలు కురిపించాడు. అయితే ప్రస్తుతం రష్మిక ట్రోల్స్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మరాయి. దీంతో నేషనల్ క్రష్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ ఎంత క్యూట్ గా కౌంటర్ వేసిందో అంటూ.. ఇకనైనా నోర్లు మూసుకుండ్రా ట్రోల‌ర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.